| |
తఱి రావణుండు సీతను మ్రుచ్చిలించుట యంతయు నీబుద్ధిమంతుఁ డైన
హనుమంతుఁ డెఱిఁగించె నది పదంపడి మిమ్ము నడుగంగ నేల మహాత్మ యింక
|
|
| తే. |
నల్పకాలంబునందె భార్యావియోగ, జనితశోకంబు విడిచెదు సత్వరముగ
వెదకి సాధించి తెచ్చి పృథ్వీకుమారి, నిక్కువముగ నర్పించెద నీకు నేను.
| 196
|
| ఉ. |
విశ్రుతకీర్తి యైనపృథివీసుత దేవనరాహిరాజిలో
కాశ్రిత యయ్యె నేని రయ మారఁగఁ జేకొని నష్ట యైన వే
దశ్రుతియట్ల తెచ్చి వితతంబుగఁ దప్పక నీకు నిత్తు
నాశ్రయ నాదుమాట హృదయంబున నమ్మి త్యజింపు శోకమున్.
| 197
|
| తే. |
అధిప విషకృత మైనభక్ష్యమును బోలె, నీదుపత్నిని శక్రజంభాదినిఖిల
దేవదానవులైనను దెల్లముగను, దక్కఁ గొనఁజాల రిది యంత నిక్కువంబు.
| 198
|
| శా. |
ఆకాశంబున రావణాంకగత యై హారామ హాలక్ష్మణా
హాకల్యాణగుణోత్తరా యనుచు శోకాక్రాంత యై చీరుచుం
బ్రాకంపించుచుఁ బోవుజానకిని శైలాగ్రంబుపై నుండి నే
నే కాకుత్స్థకులప్రదీప వినుమా యేపార వీక్షించితిన్.
| 200
|
| శా. |
ఆవైదేహియు మమ్ముఁ గన్గొని స్వకీయానర్ఘరత్నోల్లస
త్సౌవర్ణాభరణంబు లన్నియును భాస్వత్కాంతు లొప్పార నా
త్రోవం బైఁటచెఱంగున న్ముడిచి యెంతోభీతి మాముందటం
బ్రావీణ్యంబునఁ బాఱవైచి చనియెన్ రక్షోవరాధీన యై.
| 201
|
| ఉ. |
ఆరమణీయభూషణము లన్నియుఁ గైకొని మేము డాఁచి యు
న్నారము తెచ్చి చూపెద ఘనంబుగఁ దన్మహనీయవైఖరుల్
సూరిజనస్తుతా గుఱుతు చూచికొనం దగు నంచుఁ బల్కఁగా
నారఘుభర్త తెమ్ము ప్లవగాధిపతీ తడ వేల నావుడున్.
| 202
|
సుగ్రీవుఁడు సీతాదేవి తమవద్ద వైచిన భూషణంబుల రామునకుఁ జూపుట
| చ. |
హరివరుఁ డంత శీఘ్రమున నద్రిగుహాంతరసీమఁ జొచ్చి యం
దరువుగ డాఁచి యున్న వివిధాభరణంబులమూటఁ దెచ్చి దా
శరథికి విచ్చి చూపుటయుఁ జయ్యన నారఘునేత తద్వరా
భరణములం దదీయమృదుపావనచేలముఁ జూచి దీనుఁడై.
| 203
|
| శా. |
ఈహారంబులు సీత హారములె సుమ్మీ యంచు లక్షించుచు
న్నీహారంబునఁ బంకజారిక్రియ నెంతేబాష్పసంరుద్ధుఁడై
మోహం బగ్గల మందఁ బైకొనిన మూర్ఛ న్విశేషించి హా
నీహారాంశుముఖీ యటంచు నొరగె న్నిల్పోపలే కుర్విపై.
| 204
|