| |
బును సీత నారఘుపుంగవున కొసంగు మని పలికితి ననుటవలన నానుకూల్య
సంకల్పరూపం బైనయంగంబును దాసునియట్ల యవమానితుండ నైతి నని
పలుకుటవలన నీశ్వరనిర్హేతుకకరుణాపరిపాకసంభూతం బగురావణావమానంబు
చేతఁ గలిగిన ప్రయోజనాంతరవైముఖ్యంబును బుత్రదారాదులం బరిత్యజించి
వచ్చితి వని పలుకుటవలనఁ బ్రాతికూల్యవర్జనరూపం ైనయంగంబును రాఘ
వునిశరణంబు నొందితి నని పలుకుటవలన నాత్మనిక్షేపరూపం బైనయంగంబును
సర్వలోకశరణ్యుం డని పలుకుటవలన నధికారిభేదంబు లేకుండ సురనరవాన
రతిర్యక్స్థావరాంతసమస్తభూతంబులకు శరణ్యుం డనుతాత్పర్యంబును రాఘవుం
డని పలుకుటవలన నర్థిప్రార్థనావైఫల్యంబు లే దనుభావంబును మహాత్ముం డని
పలుకుటవలన రాముని సర్వభావగతిజ్ఞత్వంబును న న్నెఱింగింపుఁ డని పలుకుట
వలన నేను సర్వవిధబంధుత్వంబున రామభద్రున కాశ్రితుండ ననియెడునభి
ప్రాయంబును శీఘ్రం బని పలుకుటవలన శీతలసురభిపద్మాకరంబు గనుంగొనిన
తృషితునకుం బోలె విళంబాసహత్వంబును బ్రకటింపం జేయుచు సర్వలోక
శరణ్యాదివాక్యపంచకప్రయోగంబున గోప్తృత్వవరణరూపం బైనయంగంబును
నుపస్థితుం డయ్యె నని పలుకుటవలన విశ్వాసరూపం బైనయంగంబును విస్ప
ష్టంబుగా సూచింపం జేయుచు భగవచ్ఛాస్త్రోక్తషడ్విధశరణాగతిలక్షణంబు
లేర్పడం బలికిన నతనిపలుకులు విని యలఘువిక్రముం డగుసుగ్రీవుండు లక్ష
ణోపేతుం డైనరామునియొద్దకుం జని సంరబ్ధపరుషంబుగా ని ట్లనియె.
| 325
|
సుగ్రీవుఁడు రామునికి విభీషణురాకయుఁ దనయభిప్రాయంబు నెఱింగించుట
| సీ. |
ధరణీశ రావణాసురునితమ్ముఁడు విభీషణుఁ డనువాఁడు నిశాచరేంద్రుఁ
డన్నచేత నిరస్తుఁ డై సర్వలోకశరణ్యుండ వగునీశరణము గోరి
సమదరాక్షసచతుష్టయసముపేతుఁ డై యరుదెంచి యున్నవాఁ డతనిచంద
మెట్టిదో తెలియ వాఁ డెంతయుఁ బ్రచ్ఛన్నవేషుఁ డై యంబరవీథియందు
|
|
| తే. |
నిలిచి యున్నాఁడు వాసరనికరమునకు
సేమ మగునట్టి తెఱఁగు యోచించి మనకు
సేగి లేకుండ నిశ్చయస్థితి యెఱుంగ
వలయుఁ దగినట్టిచారులవలన మనకు.
| 326
|
| వ. |
మహాత్మా నీవు వానరులతోడ మంత్రంబు గావించి సేనాసన్నివేశంబుఁ జేసి
విచారనిశ్చితసామాద్యుపాయంబులం బ్రయోగించి గూఢపురుషప్రేషణంబుఁ
గావించి పరులమంత్రవ్యూహనయచారప్రేషణంబు లిమ్ముగా నెఱుంగు మట్లైన
నీకు భద్రంబు గలుగు రాక్షసు లదృశ్యసంచారస్వభావులు కామరూపులు శూరులు
గూఢవిప్రియకరణాభిజ్ఞులు గావున నెన్నటికి వీరి విశ్వసింపం దగదు వీఁడు రాక్ష
సేంద్రుం డగురావణునిచారుం డుపాయంబున మనయందుఁ బ్రవేశించి భేదంబు
|
|