Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/432

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుద్ధ కాండము. 409 తే. రాఘవునితోడఁ గలహంబు ప్రాణహానిఁ దెచ్చు నని యెంతఁ జెప్పినఁ దెలియ కిట్లు పలికి దుర్మతి బోధించుకతనఁ బుత్రుఁ డనుప్రవారంబుచే వైరి వైతి వీవు . క. అతిమూధునిఁ గ్రూరుని దుర్మతి సతిసాహసుని నిన్ను మంత్ర సమీప క్షితికిం దెచ్చిన రాక్షస, సతికిం జే టగుట కేమిపాటి దురాత్మా. 302 వ. నుఱియు మూర్ఖుంకపు నయరహితుండవు తీర్ణుస్వభావుండవు దురాత్ముండవునీచ మతివి గావున దేశకాలంబు లెఱుంగక యజ్ఞానంబున వలచిన చందంబునం బ్రే లె దవు దీన నేను యర్థసిద్ధి చేకుఱు బ్రహ్మశాప ప్రతిమ ప్రభంబులును గాలనికాశ రూపంబులును యమకండకల్పంబులురు సూర్యమరీచిసన్నిభంబులును నగు రామునిశరంబులు సహింప నిం దెవ్వండును సమర్థుండు గాఁ డివ్వాక్యంబులు సత్యంబులు గావున నీదుర్విచారంబు విడిచి విచిత్ర దివ్యరత్న సువర్ణ భూషణాంబర సమన్వితంబుగా సీత నారఘుపుంగవులకు సమర్పించి యమ్మహాత్మునిచరణంబులు శరణంబు గొని వీతశోకులమై యుంద మని పలికిన నతని పలుకులు విని కాలచో దితుండై రావణుండు క్రోధవిశేషంబున నేత్రంబుల నెజ్జఁదనంబు గదురఁ బరు షవాక్యంబున నవ్విభీషణున కిట్లనియె. -అతడి రావణుఁడు విభీషణునిఁ బరిఢవించుట. శృర్భం- 804 ఆ. క్రూరభోగితోడఁ గూడి యుండఁగ వచ్చుఁ, బగతు చెంతఁ జేరి బ్రతుక వచ్చు రిపుల నొగి భజించుక పటమిత్రునిపొత్తు, గూడి మనఁగ రాదు కీడు దెచ్చు. 305 సీ. తనవారి కావడ తలకొనినప్పు దానంద మొందుట మేలు పొందునప్పు డోర్వక యుండుట యు త్తములును ధర్మశీలురు నగువారిఁ జెనకి హేయ పరణుల నొగిఁ దిరస్కరణంబు లాడుట చూపోషక మొఱంగి శూరవరునిఁ బరిభవించుట మఱి ప్రచ్ఛన్నహృదయులై భయము వాటిలునట్టి భంగి వెదకు తే,టాత్మలోఁ జూడ భువనత్రయంబునందు జ్ఞాతులకు నీగుణములు నై సర్గికములు నగు టెఱిఁగి నాఁటఁగోలె మదాత్మయందు నమ్మకున్నాఁడ నీ బాంధవమ్ము నిపుడు. 306 వ. ఇందుకు నుదాహరణంబుగా నొక్క పద్మ వనంబునందుగజ గ్రహణ పాళహస్తులై తమ్మం బట్టవచ్చువారి గజగ్రాహీ పుఉనుల నవలోకించి గజంబులచేతఁ గొన్ని గీతలు వినంబడి యుండు వానిం జెప్పెన నాకర్ణింపుము. తే. పావకుం డన్యశ స్త్రము ల్పాశనిచయ మరయ మాకెందును భయావహములు గావు పూని స్వార్థ ప్రయుక్తంబు లైనయట్టి యనియె ఛాయలు మాకు భయావహములు. 100 307 905