| తే. |
అంతఁ బవమాననందనుం డధికభక్తి, నొక్కచందనతరుశాఖ నురుబలమున
విఱిచి యాస్తరణంబుగాఁ బఱచె నందుఁ, జెలఁగి సౌమిత్రియును సుఖాసీనుఁ డయ్యె.
| 188
|
| వ. |
ఇట్లు రామసుగ్రీవులు వహ్నిసమక్షంబునఁ ద్రికరణశుద్ధిగా సఖ్యంబుఁ జేసి
లక్ష్మణసహితంబుగా నుచితాసనంబుల సుఖాసీను లై పరస్పరవీక్షణంబులు
సేయుచుఁ దనివి దీరక యుండి రంతఁ గొంతవడికి సుగ్రీవుండు హర్షవ్యాకులిత
లోచనుం డై రామునిం జూచి మందమధురాలాపంబుల ని ట్లనియె.
| 189
|
| సీ. |
అవనీశ దుష్టాత్ముఁ డగువాలిచేఁ దిరస్కృతుఁడ వై రాజ్యంబు వితతసుఖము
విడిచి పత్నిని గోలువడి మనంబున ఘనంబగుభయంబున వనంబున రయంబు
తోఁ జరించుచు వచ్చి తుది నీమహాదుర్గ మాశ్రయించి విషాద మగ్గలింప
దిక్కఱి యున్నాడ నిక్కడ నలవాలి వలనిభయం బెట్లు తలఁగు నట్లు
|
|
| ఆ. |
కరుణఁ జేసి నన్నుఁ గాచి రక్షింపు మ, నాథనాథ యనఁగ నానరేంద్రుఁ
డిట్టులనియె మరల హిత ముచితజ్ఞత, సొంపు మెఱయ సూర్యసుతునితోడ.
| 190
|
శ్రీరాముఁడు వాలిం జంపెదనని శపథము చేయుట
| క. |
ఉపకారశీలి వగునీ, కుపకారము సేయు టిది సముచితము గాదే
కపినాయక నీపత్నిని, జపలతఁ గైకొన్న వాలిఁ జంపెదఁ గడిమిన్.
| 191
|
| చ. |
అనుపమవజ్రసన్నిభము లర్కనిభంబులు తిగ్మపర్వముల్
ఘనతరసర్పతుల్యములు కాలకటాక్షసమంబు లైనమ
త్సునిశితసాయకంబు లివె చూడుము గ్రక్కున నీశరంబులం
దునిమెన వాలి నబ్బలవిదూరుఁడు వజ్రముచే గిరిం బలెన్.
| 192
|
| చ. |
అని శుభంబుఁ జేసిన నినాత్మజుఁ డారఘుభర్తమాటకు
న్మనమున సంతసించి జననాయక మీ రిపు డానతిచ్చిన
ట్లనె నయమారఁ జేయుఁ డభయంబునఁ బత్నిని రాజ్యము న్సుఖం
బును సకలార్థము ల్వడసి పొల్పు వహించెద నేను మీదయన్.
| 193
|
| క. |
కరుణ దలిర్పఁగఁ బగతునిఁ, బరిమార్చెద ననుచు మీరు పలికినమాత్ర
న్నరవర సకలార్థము లి, త్తఱిఁ జేకూడె నని చాలఁ దలఁచెద బుద్ధిన్.
| 194
|
| వ. |
అని యిత్తెఱంగున సుగ్రీవుండును రాముండును శపథపూర్వకంబుగాఁ బరస్పర
కార్యసాధనోచితంబు లగువాక్యంబులు ప్రసంగించుచుండఁ దత్ప్రణయప్రసం
గంబులందు రాజీవహేమజ్వలనోపమంబు లగుసీతావాలిరావణుల వామనే
త్రంబు లదరె నప్పుడు పదంపడి సుగ్రీవుండు ప్రీతచేతస్కుండై రఘునందనున
కిట్లనియె.
| 195
|
సుగ్రీవుఁడు రామునకు సీతను దెచ్చి యిచ్చెద నని శపథము సేయుట
| సీ. |
దశరథసుత నీవు తండ్రి పంపునఁ బ్రోలు వెడలి ప్రియానుజు ల్వెంటఁ గొలువ
నడవికి వచ్చుట యందొక్కచో మీర లిరువురు దవ్వుల కేఁగి యున్న
|
|