Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/418

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

విభీషణుండు రెండవమాఱు రావణునికి బోధించుట

ఉ.

రాక్షసనాథ సీత నగరంబున నుంచిననాఁటనుండి మ
ద్వీక్షకు దుర్నిమిత్తములు వేయివిధంబులఁ దోఁచె మంత్రసం
ధుక్షితుఁ డయ్యుఁ బావకుఁడు ధూమశిఖాకలితస్ఫులింగుఁ డై
యక్షయకాంతిఁ జూపఁడు సుఖాయతనంబుల నేమి చెప్పుదున్.

180


తే.

అరయ నగ్నిష్ఠములయందు నగ్నిశాల
లందు బ్రహ్మస్థలులయందు నధిప కాన
నయ్యెడు సరీసృపములు హవ్యములయందుఁ
జాలఁ దోఁచెడు సాంద్రపిపీలికలును.

181


క.

రావణ పాలుం గురియవు, గోవులు విమదంబు లయ్యెఁ గుంజరములు హే
షావిష్కరణము లుడిగెను, భావింపఁగ గ్రాసములకుఁ బాసి హయంబుల్.

182


తే.

దానవోత్తమ యుష్ట్రాశ్వతరఖరములు
మేఁతలకుఁ బాసి చింతాజదాతురత్వ
మలమికొన నూర్ధ్వరోమంబు లై యనార
తంబుఁ గన్నీరు నించుఁ బత్తనమునందు.

183


మ.

అనుమానింపక సద్మగోపురవిమానాగ్రంబున న్సంతతం
బును గాకంబులు గృధ్రసంఘములు గుంపు ల్గట్టి రక్షోవినా
శనముం దెల్పెడుమాడ్కి మ్రోసెడు రహిం జర్చింపఁగా సంధ్యలం
దనఘా ఘోరశివాభిఘోషణము ల ట్లాలింపఁగా నయ్యెడిన్.

184


క.

మఱియుఁ బురద్వారసము, త్కరముల మాంసాదఖగమృగవ్రాతము ల
ప్పరుసున గుమిఁ గూడి భయం, కరగతి వాపోవఁదొడఁగెఁ గర్భురతిలకా.

185


వ.

మఱియు రాక్షసనినాదంబు లశనిస్వనసహితంబులై నిరంతరంబు వినఁబడుచుం
డు నిట్టియుత్పాతసూచకదుర్నిమిత్తదోషంబు సమస్తజనంబులకుఁ బ్రత్యక్షంబు
గాఁ గానంబడుచున్నది గావున.

186


క.

విను మీదోషంబునకును, బనివడి నీమనమునందుఁ బ్రాయశ్చిత్తం
బొనరింపఁ దలఁచితేనియు, జనపతికి నొసంగు మిపుడు జానకి నధిపా.

187


శా.

సాకల్యంబుగ మంత్రనిర్ణయకళాచాతుర్య మేపార న
స్తోకప్రౌఢిమ గర్జముం దెలిపి రీదోషాచరామాత్యకు
ల్నాకుం దోఁచినభంగిఁ దెల్పితి నృపన్యాయంబు నీరెంటిలో
నీకుం దోఁచినదానిఁ జేయుము నయోన్మేషంబు చింతించుచున్.

188


ఆ.

ఏను నీకుఁ గర్జ మెఱిఁగి బోధింపంగ, నెంతవాఁడఁ దోఁచినంతపట్టు
తెలిసి తెలియ కిట్లు పలికితిఁ దప్పుగా, నెంచి కనల కిటు సహింపు మధిప.

189


క.

అని మంత్రిమధ్యమున నొ, ప్పినవైరివిభీషణుఁడు విభీషణుఁడు హితం
బును బథ్యము నగుబోధము, వినయంబునఁ దెల్పె దైత్యవిభునకుఁ దెలియన్.

190