యు ద్ధకాండము, 998 టివి జనస్థానంబున ఖరాదులం జంపుటది యపకారంబుగాదా యని యంటి వేని లోకంబునందుఁ బ్రాణులకుఁ బ్రాణంబు లనశ్యంబు రక్షితవ్యంబులు గావునఁ దనయంతందానె నిష్కారణంబుగా రాముని వధింపం జనుదెంచి యస్ప రా క్ర మధుర్యునిచేత ఖనుండు ప్రాణసంరక్షణార్థంబుగా వధియింపం బడియె నది యన కారంబు గా దదీయునుం గాక. తే. ధర్మ మెచ్చటఁ గలుగు నధర్మ మెచటఁ గలుగు నచ్చట నచ్చటఁ గలుగు విజయ మపజయము రాఘవుండు ధర్మాత్ముఁ దీవు కడు నధర్మపరుండవు గాదె యధిప. క. ఆయశస్య మనాయుష్యము, భయప్రదము నింధ్య మధికపాపం బద్ధ క్షయకర మని చెప్పుదు రెం, తయుఁ బరదారాభిమర్శనంబు సురారీ. శా.సీతం దెచ్చిననాఁటఁగోలెను నపేక్షింపంగ నివ్వీట ను તુ త్పాతంబు ల్జనియించు చున్నయవి దైత్యశ్రేష్ఠ యీదుర్మతి వ్రాతోక్తు ల్డిలకించి గైకొనక మద్వాక్యంబు మన్నించి య న్నాతి గ్రామున కిచ్చి పుచ్చి పరమానందంబుతో నుండుమీ. క. సారాస్త్రవిదుఁడు సంగర, సూరుఁడు ధర్మానువర్తి సువ్రతుఁ డగునా భూరమణునితో నిటు నిష్కారణముగ వైర మెత్తఁగా నీకగునే. తే, హితులకై వడి నీమ్రోల నిచ్చకములు గఱపుదురు గాని కీడు మే లెఱిఁగి భయము మానీ మోమోట దక్కి సేమంబు గలుగు నట్టితెఱఁగు బోధింప లేరయ్య వీరు. చ. హితమును గీర్తివర్ధన మహీనసుఖప్రద మాత్మరక్షణో చితహిత మైనసాపలుకు చి తమునం దవిలించి రాఘవా ద్భుతకరచాపము కమణీవుంఖ సహా స్రకరాంశుసన్ని భా ప్రతిహతతీప్లై బాణముల పాల్పడ కయ్యమ నిచ్చి పుచ్చుమా. తే. భీమవిక్రముఁ డై నయారామభూమి కాంతునకు సీత నిచ్చినఁ గాని పుత్ర పౌత్రపుర రాష్ట్ర బలకోశమిత్ర జనులఁ గాచికొన నొం దుపాయంబు గలదె నీకు. 169 170 171 172 173 174 175 176 క. దనుజేంద్ర శూరుఁ డగున, య్యినకులునకు జనక పుత్రి నీకున్నఁ బురం బును నిఖిలరాత్రిచరులు క, దనమున నశియింతు రింత తథ్యం బరయన్. 177 సీ, మహనీయ మేరుసమానధీరుం డగురాముఁ డంబుధి దాఁటి రాక మున్నె హరివి క్రమాటోపులగువనాటులు బోషపరవకు లై లంక సొరక మున్నె కులిశధారాహతిఁ గూలు శైలంబుల పగిది రాక్షసు లాజిఁ బడక మున్నె 180
పుట:గోపీనాథరామాయణము2.pdf/416
స్వరూపం