| |
మీఁదికి సమరవినోదార్థి యై వచ్చు టది నిక్క మబ్బంగి యైన మనకుఁ
గొఱఁత యేమి బలంబుఁ గూర్చి యొడ్డారించి ఘనజన్య మొనరింతమనియొ లేక
|
|
| తే. |
సంధి సేయుద మనియొ యీచంద మెల్లఁ
గూడి యోచించి పురరాష్ట్రకోశములకు
హాని లేకుండ వచియింపుఁ డనిన వార
లందఱును గేలు మోడ్చి యిట్లనిరి ప్రీతి.
| 129
|
సభ్యులు రావణునకుఁ దమయభిప్రాయముఁ దెల్పుట
| క. |
పరపక్షముఁ దనపక్షము, నరయక నృపనీతిబాహ్యు లగుదుర్బుద్ధు
ల్తఱి వచ్చినపుడె నృపతికిఁ, గర మాప్తులుఁ బోలె వెరవుఁ గఱపుదప రెందున్.
| 130
|
| తే. |
అధిప తోమరశక్తిగదాసిశూల, పరిఘపట్టిసముద్గరప్రాసకుంత
మండితం బైనసైన్యంబు మనకుఁ జాలఁ, గలిగియుండ విచారంబు గలుగ నేల.
| 131
|
| క. |
భోగవతి కేగి ఘనబా, హాగర్వ మెలర్ప హరుల ననిఁ బొరిగొని త
ద్భోగగతరత్నచయములు, వేగమ గొని తెచ్చినట్టివీరుఁడ వధిపా.
| 132
|
| శా. |
ఆకైలాసనగాధివాసుఁ డగుయక్షాధీశు నుగ్రాజి న
స్తోకప్రౌఢి వధింపఁ బూని హరమిత్రుం డౌట మన్నించి కీ
లాకల్పోజ్జ్వలమూర్తి వై పటుశరాలాతాహతి న్సేనల
న్వీఁకం ద్రుంచి తదీయపుష్పకము దేవే తొల్లి రక్షోవరా.
| 133
|
| తే. |
మయుఁ డనునిశాచరుండు నీమహిమఁ జూచి
వెరవుతో బాంధవంబు గావింపఁ గోరి
దానవేశ్వర భార్యార్థి వైననీకు
నొసఁగఁడే తొల్లి తనకూఁతు నుత్సుకుఁ డయి.
| 134
|
| తే. |
దానవేంద్రుని మధు వనువాని వీర్య
గర్వితుని దురాసదుని విగ్రహమునందుఁ
బేర్చి నొప్పించి విజయంబు పెంపు వడసి
సాఁకితివి కాదె కుంభీవసీకృతమున.
| 135
|
| శా. |
అక్షీణోగ్రపటుప్రతాపచతురంగానీకయుక్తంబుగా
దక్షత్వంబున నేగి రాక్షసకులాధ్యక్షున్ దిశాపాలహ
ర్యక్షున్ నైరృతి నాజిరంగమునఁ బాఱందోలి యాతండు సం
రక్షింపంగదె యంచు దైన్య మడరం బ్రార్థింప సమ్యక్కృపా
నీక్షం జంపక కాచి పుచ్చితివి గాదే దైత్యవంశోత్తమా.
| 136
|
| తే. |
మును రసాతలసీమకుఁ జని నిశాట, వర్య శంఖకర్కోటకవాసుకిధృత
రాష్ట్రతక్షకైరావతప్రముఖనిఖిల, హరివరులఁ బాఱఁదోలి జయంబుఁ గొనవె.
| 137
|
| ఉ. |
అక్షయబాహుశౌర్యులు మహాత్ములు లబ్ధవరు ల్నిశాచరు
|
|