Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/404

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గారవనంబులం గలనగంబుల రెంటిని గాంచె ముందటన్.

77


క.

అక్కొండలు మలయం బన, నొక్కటి సహ్యం బనంగ నొక్కటియును బెం
పెక్కిననామంబులతో, నక్కజముగఁ బొల్చు నిర్జరావాసము లై.

78


వ.

అమ్మహామహీధరంబులరెంటినడిమికాంతారంబు దఱిసి.

79


ఉ.

అచ్చటిపుష్పితద్రుమము లచ్చటిచందనకాననోత్కరం
బచ్చటిశైలనిర్ఝరము లచ్చటిరమ్యలతాగృహోచ్చయం
బచ్చటిదివ్యకందరము లచ్చటిసర్వమనోజ్ఞసౌరభం
బిచ్చకు వేడ్క సేయఁగ మహీపతి చూచుచుఁ బోవుచుండఁగన్.

80


సీ.

మలయచందనవృక్షములసౌరభముఁ బూని మెల్లమెల్లన వీచెఁ జల్లగాలి
గాలిరాకకుఁ గొన ల్గదలఁ దావులు నీనుతరువులు గురిసె క్రొవ్విరులవాన
విరులపాటున కుల్కి వెడలుతుమ్మెదచాలు ఝుమ్మని మింట గానమ్ముఁ జేసె
నళులగానములకు నడరి వెంటనె జంటకోయిల లిరువంకఁ గూయఁ దొడఁగెఁ


తే.

బికరవంబులఁ జెలరేఁగి శుకకులంబు, కలరవంబునఁ గలకల పలుక సాగెఁ
జిలుకకదుపులపలుకుల కలరి కేకు, లచలశిఖరాగ్రములమీఁద నాడఁదొడఁగె.

81


చ.

భువనమనోహరస్ఫురణఁ బొల్చుపయోధితరంగవేగసం
భవపవమానఘట్టితసమంచితధాతుపరాగజాల మా
ప్లవగచమూకదంబములపైఁ గవియం గడుఁ జిత్రవస్త్రము
ల్దవిలిచికొన్నచందమునఁ దద్దయుఁ జూడఁగ నయ్యె నయ్యెడన్.

82


శా.

ఘోరం బైనవనాటసైన్యములనిర్ఘోషంబు గంభీరపాం
థోరాశిధ్వనిభంగి యైన విని యెంతో భీతిమైఁ బాఱెఁ ద
త్సారవ్యాళవరాహభల్లచమరీశార్దూలమాతంగికా
సాగంగర్క్షతరక్షుశల్యమహిషీసాలావృకవ్రాతముల్.

83


మ.

ఇభయూథంబుతెఱంగునం గపిబలం బేగంగ వీక్షించి త
ద్రభసోద్రేకమునం గలంగి భయసంత్రస్తంబు లై మ్రోయుచు
న్నభము న్దాఁటఁగ నేగె శీతజలపూర్ణస్రోతము ల్పాసి టి
ట్టిభకారండవచక్రవాకబకఘోటీక్రౌంచసంఘాతముల్.

84


చ.

విలసితగంధబంధురనవీనమనోహరపద్మకైరవో
త్పలవిగళన్మరందరసధారలఁ గమ్మనితావు లీనుశీ
తలసరసీపయఃకణకదంబము వాయువశంబున న్రహి
న్బలములమీఁద వ్రాలి వెసఁ బాపెఁ బథిశ్రమజాతఖేదమున్.

85


సీ.

రుచిరంబు లగుఫలప్రచయమూలంబులు మించువేడుకలతో మెక్కి మెక్కి
యమృతోపమానంబు లగుస్వాదుజలములు గొని దప్పి దీఱంగఁ గ్రోలి క్రోలి
చఱులలోనికి డిగ్గి సరఘల నెగఁ జోపి తమి దీఱ మధువులు ద్రావి త్రావి