లొత్తఁ చంద్రోదయసమయఘూర్ణమానమహార్ణవంబునుం గ్రేడి సేయుచు
బ్రావృట్కాలబలాహకంబుకరణి గర్జించుచు సింగంపుఁగొదమలభంగి నుప్పొం
గి నింగికి దాఁటుచు దృప్తశార్దూలంబులమాడ్కి నాగ్రహించుచు మదవార
ణంబులపోలిక మాఱు మసలుచు గరుడునిమాడ్కి దూరంబున కెగయుచు
సుగంధిమధువులు గ్రోలుచు రుచిరంబు లగుఫలమూలంబులు నమలి సొక్కుచు
మంజరీపుంజరంజితంబు లగువృక్షంబు లంసభాగంబుల నలవరించుచు గరుడా
నిలతుల్యవేగంబున గిరిశృంగంబులమీఁది కుఱుకుచు సకలరాక్షససహితంబుగా
దశగ్రీవుని నేమె మర్దించెద మని రామునిసమ్ముఖంబునఁ బంతంబులాడుచు రాఘ
వార్థంబునందు సమారోపితవిక్రము లై యొండొరులకు హర్షవీర్యబలోద్రే
కంబులు చూపుచు యౌవనోత్సేకజం బగుదర్పం బేర్పడ విహరించుచు మహేం
ద్రధ్వజసన్నిభంబు లగుపుచ్ఛంబు లంబరంబునం ద్రిప్పుచు నాస్ఫోటితారా
నంబు దిశాకుడ్యంబులు వ్రక్కలించుచు భుజావిక్షేపణంబున శైలద్రుమంబులు
భంజించుచు నూరువేగంబున లతావితానంబులం ద్రుంచుచుఁ బదాఘాతంబున
గండశిలాఫలకంబు లెల్ల నుగ్గునూచంబు సేయుచు శైలశిఖరంబు లుత్పాటించి
కందుకక్రీడ లాడుచుఁ బరస్పరాలింగనంబుల నితరేతరస్కంధాధిరోహణం
బుల నన్యోన్యసంఘటనంబులఁ గాపేయజాతిచేష్టావిశేషంబులు నెఱపుచు
వెల్లివిరిసినమహాసముద్రంబుపోలిక ననివార్యంబై యనంతంబై యప్రమేయం
బై యవ్వానరసైన్యంబు సమస్తంబు లగునదీప్రవాహంబులును విమలోదకంబు
లగుసరోవరంబులును ద్రుమాకీర్ణంబు లగుపర్వతంబులును సమంబు లగుభూమి
ప్రదేశంబులును నిండి మెండుకొని ప్రచండంబు లగువిక్రమాటోపంబుల
బహుయోజనంబులనిడుపును నిడుపునకుం దగినవెడల్పునుం గలిగి మేఘజా
లంబు లంబరంబు నాచ్ఛాదించినతెఱంగున నీరంధ్రంబుగాఁ బుడమి నాచ్చా
దించి రామునిపిఱుందదెస జయజయధ్వనులతోడ దక్షిణాభిముఖంబుగాఁ గదలి
నడిచె నప్పుడు తదీయచరణవిఘట్టనంబునం బుట్టినమహీపరాగపటలంబు గలయ
బెరసి యవక్రగతి లోకంబు నాక్రమించి యంధకారారాతిం గప్పి దిశాము
ఖంబులకుఁ గ్రొత్తచీఁకటులు సంపాదించె నంబరచరభూతవ్రాతంబు లంధుల
భంగి సుడివడి రాసమయంబున.