| తే. |
మఱియు యామినీచరులు నిమ్నంబు లైన
గహనములయందు బర్వతగుహలయందు
నొదిఁగి బలముల నలయఁబెట్టుదురు దానిఁ
గనుఁగొని చనంగవలయు మార్గంబునందు.
| 59
|
| తే. |
అసురులకు మన కతిఘోర మైనయుద్ధ
మది గలుగు బాహుబలసాధ్య మట్లు గాన
వానరులలోన దుర్బలు లైనవారి
నేర్పరించి కిష్కింధకుఁ జేర్పు మిపుడు.
| 60
|
| వ. |
మఱియు గిరిసంకాశుం డగుగజుండును మహాబలుం డగుగవాక్షుండును సత్త్వ
సంపన్నుం డగుగవయుండును నీకు బాసటయై యాఁగదుపులముంగలం జను
దృప్తవృషభంబులచాడ్నున సాగరంబుంబోలె ఘూర్ణిలుచున్న వానరవాహిని
పురోభాగంబునం జనియెదరు మఱియు మారుతతుల్యవేగుం డగువృషభుం
డనువానరశ్రేష్ఠుండు సేనకు దక్షిణపార్శ్వంబును గంధహస్తియుంబోలె దుర్ధ
ర్షుం డైనగంధమాదనుండు సవ్యపార్శ్వంబు నధిష్టించి రక్షించుకొనుచుం జను
దెంచెద నేను హనుమంతునియంసభాగము నారోహించి యైరావతగజారూ
ఢుం డైనదేవేంద్రు ననుకరించుచు బలంబులకుఁ గన్నులపండువుగా సేనామ
ధ్యంబునఁ జనుదెంచెద నంత కోపముం డగులక్ష్మణుండు సార్వభౌమనాగారూఢుం
డైనకుబేరుండుంబోలె నంగదు నారోహించి నాపిఱుందదెస నరుదెంచెడుఋక్ష
పుంగవుం డగుజాంబవంతుండును మహాసత్త్వుం డగువేగదర్శియు సుషేణుం
డును నీమువ్వురు వనాటవాహినీకుక్షిప్రదేశంబు రక్షించుచుం జనుదెంచెద రని
యిత్తెఱంగున నిర్దేశించినఁ దత్సమీపవర్తి యగుసుగ్రీవుండు రామునివచనంబు
వీని యట్ల సేయుం డని మహావీరు లగుయూథపుల కందఱ కాజ్ఞాపించినఁ
దత్క్షణంబ.
| 61
|
| చ. |
అరుదుగ శైలసానువులయందును దద్గుహలందు వృక్షకో
టరములయందు నిర్ఝరతటంబులయందు వసించి యున్నభీ
కరహరియూథపు ల్సమరకౌతుకతన్ నిజసైన్యయుక్తు లై
గురునుతి రాముసన్నిధిని గుంపులు గట్టి రనేకభంగులన్.
| 62
|
శ్రీరాముఁడు వానరసేనాసమేతుఁడై దండు వెడలుట
| తే. |
ఇట్లు గూడినబలము లనేకకోటు, లర్బుదంబులు తనుఁ గొల్వ నర్కతనయ
లక్ష్మణోపేతుఁడై జయలక్షణాన్వి, తుండు రాముండు శుభవేళ దండు వెడలె.
| 63
|
| వ. |
అప్పుడు నీలాంజనచయోపమంబు లగుభల్లూకబలంబులును మదోద్దండవేదండ
కాండంబులలీలం గ్రాలుగోలాంగూలబలంబులును గాంచనాచలసంకాశంబు
లగువానరబలంబులును సుగ్రీవునిశాసనంబు శిరంబునం బూని లెక్కకు వెక్క
సం బై యుక్కు మిగిలి యక్కజంపుఁగయ్యంపుమక్కువ మొగంబులం జెక్కు
|
|