Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/398

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యయుతు ల్దానవు లొక్కలక్షచతురంగానీకము ల్గొల్వ న
క్షయులై పాయక గాచి యుందు రలలంకాదక్షిణద్వారమున్.

44


క.

బలుకైదువులు కరంబుల, నలర న్ఖడ్గాగ్రయోధు లగుదానవయో
ధులు వేయి వేలు గాతురు, మలయుచుఁ దన్నగరపశ్చిమద్వారమునన్.

45


ఆ.

మఱియు రావణుండు మన్నించువారు ర, థాతిరథులు దారుణాస్త్రకుశలు
లగునిశాటు లొక్కయర్బుదసంఖ్యలు, గాతు రుత్తరంపుగవనియందు.

46


వ.

మఱియు ననేకశతనహస్రసంఖ్యాతు లగుయాతుధానయోధులు పెక్కండ్రు
పదాతులు సేవింప నప్రమత్తు లై మధ్యమగుల్మంబు రక్షించుచుండదు రి
ట్లసంఖ్యబలసంరక్షితం బైనలంకాపురంబున కధ్యక్షుం డై రాక్షసవల్లభుం
డగురావణుండు సహస్రాక్షు నైన లెక్కించక యక్కజంపుమదంబునఁ గయ్యం
బునకుం గాలు ద్రవ్వుచుండు సహాయసంపన్నుండు గానివాఁ డప్పురంబు
ప్రవేశింపంజాలఁ డట్టిలంకాపురం బే నొక్క రువునఁ బ్రవేశించి సర్వంబునుం
బరిశోధించి సీత నవలోకించి భవత్కుశలంబు దెల్పి క్రమ్మఱ ననుజ్ఞ వడసి.

47


మ.

వరణంబు ల్పడఁ ద్రోచి ఖేయముల విధ్వంసంబు నొందించి భా
సురసౌధంబులఁ గూల్చి పేరు గలరక్షోవీరులం ద్రుంచి దు
ష్కరదైతేయబలంబులోన నొకభాగం బుద్ధతిం జంపి క్ర
మ్మఱఁ బాథోనిధి దాఁటి మీకడకు సమ్యగ్భక్తి నేతెంచితిన్.

48


తే.

శరధి లంఘించుటకు నరిపురముఁ జొరుట
కలఘుమతి యత్న మొనరింపవలయుఁ గాని
పగతుఁ బరిమార్చు టన నెంతపని మహాత్మ
దేఱి చూచినయంతనె దీఱిపోఁడె.

49


ఉ.

ఏమి గొఱంత నీకు బల మీద్వివిదుండును మైందుఁడుం గపి
గ్రామణి యంగదుండు రిపుకాలుఁడు నీలుఁడు జాంబవన్నలు
ల్భీమజవంబుతోఁ జని లలిన్ గిరి సాలయుతంబుగా బల
శ్రీమహిమన్ బెకిల్చి యొకవ్రేల్మిడి లంకను దెత్తు రుద్ధతిన్.

50


ఆ.

చింత యేల నీకు క్షితినాథ సుముహూర్త
మందు శీఘ్రముగ దశాస్యుమీఁది
కెత్తిపోవుటకు నహీనబలంబుల
కానతిమ్మ యుక్త మగువిధమున.

51

రాముఁడు సుగ్రీవునకు యుద్ధయాత్రకుఁ దగినకాలము నిరూపించి చెప్పుట

క.

అని హనుమంతుఁడు వినయం, బునఁ బల్కిన విని నరేంద్రపుంగవుఁడు ముదం
బున నిననందనువదనముఁ, గనుఁగొని యిట్లనియె విజయకౌతూహలి యై.

52


చ.

అనిలసుతుండు లంకవిధమంతయు నేర్పడఁ జెప్ప వింటి న
త్యనుపమశక్తి వైరి రయమార వధించెద నిక్క మింతయు