Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/397

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


చ.

సురుచిరభంగి నప్పురముచుట్టును మౌక్తికనీలవజ్రసుం
దరరుచిఁ బొల్చు హేమవరణంబులపై నలరు న్సమాగత
స్ఫురదరిసైనికాళిఁ బొరివోవఁగఁ జేయు నరాతినేత్రభీ
కరదివిషన్మతిభ్రమణకారిమహోపలబాణయంత్రముల్.

39


ఆ.

జలధికంటె లోఁతు గలిగి సుశీతల, జలము లుల్లసిల్ల సమదమకర
మీనకచ్ఛపములు మెఱయ నగడ్తలు, ఘోరభంగి నలరుఁ గోటచుట్టు.

40


క.

విలసితబద్ధకవాటో, జ్జ్వలితము లై ఘోరపరిఘవంతము లై య
ప్పలలాశనునగరంబునఁ, గలుగు న్ద్వారములు నాల్గు కడుఁ బొడ వగుచున్.

41


వ.

అమ్మహాద్వారప్రదేశంబులయందు భారశిలామోచనయంత్రంబులును సజ్జీకృత
కాలాయసమయచతుర్వితస్తిప్రమాణముద్గరవిశేషంబులును బహుసాహస్రం
బులు రక్షోగణరచితంబు లై భీమప్రకారంబునం బొలిచియుండు నమ్మహాద్వారం
బులయందుఁ బరిఖోపరిసంచరణార్థంబు మంచరూపంబున నిబద్ధంబు లైనమార్గ
విశేషంబులు మహోన్నతంబు లై మహాగృహయంత్రోపేతంబు లై విశాలం
బు లై దీర్ఘంబు లై పగతు లెత్తి వచ్చినప్పు డప్పరసైన్యంబుల స్వనిష్ఠయంత్రం
బులచేత నివారించుచుఁ బురంబు రక్షించుచుండు నిం దొక్కసంక్రమంబు
దృఢంబును విశాలంబును బలవంతంబును మహోన్నతంబును నకంప్యంబును
ననేకకాంచనస్తంభనిర్మితంబును విశాలవితర్దికాశోభితంబు నై యుండు జాగ
రూకుండును బ్రమాదరహితుండు నై రావణుం డెప్పు డేనియు యుయుత్సుం
డగునప్పు డాసంక్రమంబునందుఁ బరసేనాదర్శనార్థంబు నివసించియుండు నప్పు
రంబు మఱియు నతిశ్లక్ష్ణసముత్తుంగత్రికూటశిఖరంబునందుఁ గ్రాలుట వలన నారో
హణాలంబనరహితం బై దేవతల కైన నగమ్యంబై దూరస్థితపరతీరం బైనసము
ద్రపారంబున నుండుటవలన నౌసంచారమార్గం బైన లేకుండుటం జేసి సర్వది
గ్వార్తాసంచారరహితంబై నాదేయపార్వతవాన్యకృత్రిమాత్మకచతుర్విధదుర్గసం
రక్షితం బై యుండు నిత్తెఱంగున నగాధంబు లైనపరిఖాచయంబులును వివి
ధంబు లైనయంత్రంబులును లంకాపురి నల్గడల బలసి ప్రకాశింపంజేయుచుండు
నప్పురంబు నిరంతరవీరరాక్షసకోలాహలసంకులంబై యెవ్వరికిం దేఱిచూడరాక
నిరాలంబం బగువాయుమార్గంబునం దేజరిల్లుచుండు మఱియు.

42


చ.

పరశుగదాసికుంతములు ప్రాసపరశ్వథముద్గరంబులుం
శరములఁ బూన్చి బిట్టలుకఁ గాటుకకొండలలీలఁ గ్రాలుచు
న్సురవరయక్షకిన్నరులు చూచి మనంబునఁ దల్లడిల్లఁగా
వెరవునఁ గాతు రొక్కపదివేవురుదైత్యులు తూర్పువాకిటన్.

43


మ.

రయ మార న్దివిషత్కదంబముల సంగ్రామంబులం దోలి ము
న్జయుముం గొన్నజితారులు న్వికటరూక్షప్రేక్షణు ల్ఘోరకా