Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నొందుటవలన మేహనమారోత్సన్నమధూదకు లై విహరించుచున్న వానరుల
నిరీక్షించుచు నంగదునియొద్దకుం జని యంజలి గీలించి విషయవినమితశరీరుం డై
యి ట్లనియె.

1442


చ.

అనిమిషనాథపౌత్ర వినుమా యువరాజవు గాన నీవు మా
కనవరతంబు గోప్తవు స్రహత్తవు నీ కరయంగ నడ్డ మెం
దును గల దే వళీముఖులు దోడ్పడ మూర్ఖత నెగ్గు చేసితిన్
జననుత నాదుచెయ్దములు సైఁచి కృపామతి నాదరింపవే.

1443

అంగదుఁడు దధిముఖవచనంబున వానరసహితముగా సుగ్రీవునికడకుఁ బోవుట

వ.

ఏ నప్పుడు మీచేత భంగపడి వనపాలకసహితంబుగా భవత్పితృవ్యుం డగు
సుగ్రీవునిపాలికిం జని మీరాకయు వనంబుపోకయు నిరవశేషంబుగా మధువులు
ద్రావుటయు సర్వంబు విన్నవించిన నతండు రుష్టుండు గాక హృష్టుండై శీఘ్రం
బున మిమ్ముం దోడ్కొని రమ్మని పంచె రాఘవు లట్ల సేయు మని పలికి రన్నర
వానరనాయకులు భవదాలోకనకృతోత్సాహులై యున్నవారు నీవు వనచరబల
పరివృతుండనై శీఘ్రంబున నమ్మహాత్ములపాలి కరుగు మని పలికిన నతనిపలుకుల
కలరి వాలిసుతుండు హరిశ్రేష్ఠుల నవలోకించి మదాగమనవృత్తాంతంబు
రామునిచేత శ్రుతం బయ్యె నని శంకించెదఁ గృతకార్యుల మైనమన మిచ్చటఁ
దడవు సేయుట కర్తవ్యంబు గాదు మీరు యథేష్టంబుగా మధుపానంబు గా
వించి విగతవిశ్రము లైతి రింక నిక్కడ నేమి కార్యంబు మద్గురుం డగుసుగ్రీవు
పాలికిం బోదము కపికుంజరు లందఱుఁ గూడుకొని యెద్ది పంచిన దానిం గావిం
చుట కేను గర్త నైతి నేను బరతంత్రుండ యువరాజ నయ్యును మిమ్ము నాజ్ఞా
పించుటకు సమర్థుండఁ గాను గృతికార్యు లైనమీరు నా చేత ధర్షించుట
కశక్యు లైతిరి.

1444


క.

నా విని సంతోషము మది, నావిర్భవ మందఁ గీశు లంగదుఁ గని సం
భావించి యిట్టు లనిరి వ, చోవైభవ మలరఁ బవనసూనుఁడు వినఁగన్.

1445


సీ.

అమరేంద్రపౌత్ర నిజైశ్వర్యములు నచ్చి మదమత్తు లై యభిమాన మూఁది
మదిఁ బెద్దవారి సమ్మానంబు సేయక తామె యన్నిటికిఁ బెద్దల మటంచుఁ
బరులఁ జుల్కనఁ జేసి పలుకుట రాజుల కరయ నైసర్గిక మట్టిదోష
మించుక నీయందుఁ గొంచము నీయట్టిరాజు గలఁడె జగత్త్రయమునందు


తే.

నగచరోత్తమ నీవినయాతిశయమె, భావిభాగ్యోదయవిశేషపటిమ దెల్పు
చున్నయది నీవు చెప్పిన ట్లుష్ణకరజు, పాలి కిప్పుడె పోవుట పరమహితము.

1446

సుగ్రీవుఁ డంగదసింహనాదము విని రామలక్ష్మణులకుఁ గార్యసిద్ధిం దెల్పుట

వ.

అని పలికి యవ్వనచరు లొండొరులం బురికొల్పుకొని యంగదుం బురస్కరిం
చుకొని యతివేగంబున మహీతలంబున నుండి గగనంబున కెగసి యంత్రోక్షి