| |
సుప్రతిష్ఠిత మై యుండు శూరవర్యుఁ
డడఁరి నతఁడె గాక కలఁడె యన్యుఁ డొకఁడు.
| 1434
|
| క. |
అంగదుండు బలేశ్వరుం డఁట విధాతృ, నందనుఁడు నేత యమ్మరున్నందనుండు
తగ నధిష్ఠాత యఁట రాజతనయ ధాత్రి, నెంత పనియైనఁ దీర్చుట కేమి యరిది.
| 1435
|
| సీ. |
యామ్యదిశాభాగ మంతయు శోధించి జానకిఁ బొడగని సంభ్రమమున
నంగదప్రముఖవనాటశేఖరు లెల్ల మానక చనుదెంచి మధువనంబుఁ
జొచ్చి విచ్చలవిడి సొరిదిఁ దేనెలు ద్రావి రది చూచి యోర్వక యడ్డపెట్టఁ
బోయిన మ మ్మెల్ల ముష్టిసంహతులచే నొప్పించి రని మాకుఁ జెప్పుచున్న
|
|
| తే. |
వాఁ డితఁడు దధిముఖుఁ డనువానరుండు
వినుతవీర్యుండు ప్రఖ్యాతవిక్రముండు
వాడును నానాఁడు వాడి మెఱసి
గరిమఁ దగ నవ్వనంబును గాచుచుండు.
| 1436
|
| చ. |
జనవరపుత్రి నిక్కముగ జానకి గన్పడె నట్లు గానిచో
వనచరవీరు లెల్ల ననివార్యగతిం జనుదెంచి వీఁకతో
ననిమిషదానవాదులకు నైనఁ గనుంగొనరానియట్టి మ
ద్వన మటు చొచ్చి తేనియలు ద్రావుదురే కడు సాహసంబునన్.
| 1437
|
| క. |
అని పలికిన సుగ్రీవవ, దననిర్గతమధురవాణి తప్పక విని యా
జననాథసుతులు మిక్కిలి, మనమున హర్షించి యతని మన్నించి రొగిన్.
| 1438
|
సుగ్రీవుఁ డంగదాదులఁ దోడ్కొని రమ్మని దధిముఖున కాజ్ఞాపించుట
| వ. |
ఇట్లు రామలక్ష్మణులు ప్రీతిస్పీతనేత్రులును సంప్రహృష్టచిత్తులును సిద్ధార్థులు
నై యభూతపూర్వశోభావిశేషంబునం బొల్చి రంత సుగ్రీవుండు కార్యసిద్ధిని గర
గత యైనదానిఁగా నిశ్చయించి ప్రీతిసంహృష్టసర్వాంగుండై దధిముఖు నవలో
కించి కృతకార్యు లైనవానరులచేత వనంబు భుక్తం బగుటకు సంతోషించితిఁ
గృతార్థు లైనహనుమత్ప్రముఖవానరవీరుల నవలోకించుటకు సీతాభిగమన
కృతప్రయత్నంబు వినుటకు నిశ్చయించి యున్నవాఁడ శీఘ్రంబున వానరులం
దొడ్కొని రమ్మని పలికిన.
| 1439
|
| తే. |
ఆతఁడు దధిముఖుఁ డట్ల కా కనుచు సూర్య
నందనునకును రఘుకులనందనులకు
వందన మొనర్చి సంభృతానందుఁ డగుచు
నగచరకదంబపరివృతుం డై గడంగ.
| 1440
|
| క. |
వినువీథి కెగసి రయమున, మును వచ్చిన సరణి నేగి మోదంబున న
వ్వనపాలశేఖరుఁడు మధు, వనము ప్రవేశించెఁ దోడివారును దానున్.
| 1441
|
| వ. |
ఇత్తెఱంగున నవ్వనంబు సొచ్చి యచ్చటఁ బీతం బగుమధువు జీర్ణత్వంబు
|
|