Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


వాఁడనై బద్ధుం డైనవానితెఱంగున నుండి వాని నవలోకించి వానిచేత నడుగం
బడినవాఁడనై యిట్లంటి.

1350


సీ.

దశకంఠ యేను సదాగతి కౌరససుతుఁడ సుగ్రీవున కతిహితుండ
హనుమంతుఁ డనువాఁడ ననఘాత్ముఁ డగురాఘవునకు దాసుఁడ జగద్వినుతబలుఁడ
నమ్మహాత్ముఁడు పంప నంబుధి దాఁటి లంకకు వచ్చి సీతను గాంచి విభుని
కుశలంబు దెల్పి యెక్కుడు ప్రీతి నీతోడ వాదింపుతలఁపున వనము నేల


తే.

పాలు చేసితి దానికిఁ జాలఁ గినిసి, ధీరులై దైత్యు లడరిన దేహరక్ష
ణార్ధము వధించి తుది నీమహత్త్వమెల్ల, నెఱిఁగి పోవంగ వచ్చితి నిప్పు డిటకు.

1351


వ.

ఇది మదీయవృత్తాంతం బింక నొక్కహితోపదేశంబుఁ జేసెద వినుము.

1352


సీ.

అనఘాత్ముఁ డగురాముఁ డనుజసమేతుఁడై విపులనానాజాతివృక్షశోభి
తం బైనఋశ్యమూకంబున కేతెంచి ప్రీతి నందున్న సుగ్రీవుఁ గాంచి
తనపత్ని నసురుఁ డుద్ధతి నెత్తికొనిపోవు టెఱిఁగించి తత్కృత్య మెలమి దీర్చి
సాహాయ్య మొనరింపు సఖ్యంబు వాటింపు మనిన నక్కపినాథుఁ డట్లు గాక


తే.

యని యొడంబడి జానకి నరసివచ్చి, యింపుతో వైరిపైకి దండెత్తి పోయి
పోరిలో వాని బలయుతంబుగ వధించి, సీత నీ కిత్తు ననుచు సంప్రీతుఁ జేసి.

1353


వ.

పదంపడి తనకును వాలికిని వైరంబు గలుగుటయు నతండు తనభార్య నపహ
రించి దేశంబు వెడల ననుచుటయు నెఱింగించిన నారఘుసత్తముండు వాలిం
బరిమార్చి వానరరాజ్యంబు నీ కొసంగెద నని పలికె ని ట్లొండొరులు వహ్నిసాక్షి
కంబుగా సఖ్యంబుఁ జేసి రంత నమ్మనుజవల్లభుండు వాలి నొక్కబాణంబున వధిం
చి తదీయరాజ్యంబు సుగ్రీవున కొసంగిన నతం డధిష్ఠితరాజ్యతంత్రుం డయ్యె
సుగ్రీవునిచేతఁ బ్రస్థాపితుం డనై యేను దౌత్యంబు వాటించి భవత్సకాశం
బునకుం జనుదెంచితి నరవానరవల్లభులప్రభావం బెఱుంగనివాఁడ వగుటం
జేసి యజ్ఞానంబున సీతం దెచ్చితివి వారితో నెదిరించుట కింద్రాదు లైన సము
ర్థులు గా రింక నైన వివేకంబు గలిగి వానరవీరులు భవద్భలంబు వధింపక
మున్నె యమ్మహాదేవి నమ్మహాత్మున కొసంగుము వానరులకు లంకానాశంబు
సేయునంతసామర్థ్యంబు గలదా యని శంకింప వలవదు వానరులప్రభావంబు
తొల్లి నీ వెఱుంగవు యుద్ధసాహాయ్యార్థంబు గూర్చినవానరు లందఱు దేవ
లోకంబు నైన సాధింప గల రియర్థంబు నీకుం జెప్పుమని సుగ్రీవుండును గఱపె
నని యిటలు శంకింపక జంకించి పలికిన నతండు కోపించి.

1354


చ.

కనులఁ గృశానుకీల లొలుకన్ దివిజారులఁ గాంచి పల్కు నీ
వనచరుఁ డస్మదీయులవైభవ మింత యెఱుంగ కుద్ధతిన్
మనమునఁ దోఁచినట్లు బలుమాటలు ప్రేలెడు వీనిఁ బట్టి చ
య్యన వధియింపుఁ డంపిననృపాగ్రణికిన్ గడు వ్రీడ పుట్టఁగన్.

1355