| |
డ్కొని చనుదెంతు నంచుఁ గపికుంజరుఁ డుత్తమభక్తితోడ వం
దన మొనరించి వేగ పయనంబున కున్ముఖుఁ డయ్యె నయ్యెడన్.
| 1241
|
హనుమంతుఁడు సముద్రలంఘనంబుకొఱ కరిష్టపర్వతం బెక్కుట
| వ. |
ఇత్తెఱంగున వైదేహి నాశ్వాసించి సముచితంబుగా వీడ్కొని స్వామిసందర్శ
నోత్సుకుండై యక్కపిశార్దూలుండు సముద్రప్రాంతకాంతారమండితం బైన
యరిష్టం బనునొక్కకొండ యెక్కె నది మఱియు నీలాంబరీకృతతుంగపద్మకజు
ష్టవినీలకాంతారంబును ధౌతోత్తరీకృతశృంగాంతరవిళంబిశారదాభ్రంబును బోధ
కీకృతమార్తాండకిరణసందోహంబును లోచనీకృతసముద్ధూతధాతువిశేషంబును
జందనీకృతనానావిధకుసుమపరాగవిసరంబును వేదధ్వనికృతతోయౌఘమంద్ర
నిస్వనంబును గీతీకృతవిస్పష్టనానాప్రస్రవణనినదంబును నూర్ధ్వభుజీకృతసము
చ్ఛ్రితదేవదారుకదంబంబు నాక్రోశనన్నాదీకృతప్రపాతలనిర్ఘోషంబును జలజ్జ
రాపాండుశిరోజీకృతశరత్పుష్పితసప్తచ్ఛదవృక్షంబును వేణునాదీకృతమారు
తోద్ధూతకీచకకదంబనాదంబును నిశ్శ్వాస్తీకృతఘోరాశీవిషసముచ్ఛ్వాసమా
రుతంబును ముఖరంధ్రీకృతనీహారపూర్ణగంభీరగహ్వరంబును జరణీకృతప్రత్యం
తపర్వతంబును గాత్రభంగీకృతగగనచుంబిశిఖరంబును బుష్పవద్వితతలతా
ప్రతానావృతసాలతాలతమాలరసాలాశ్వకర్ణపరివేష్టితనానావిధకూటకోటిద
రీఝురీవిరాజితంబును నానామృగగణాకీర్ణశిలాసంచయసంకటంబును మహర్షియ
క్షగంధర్వకిన్నరోరగసేవితసానుతలంబును ధాతునిర్గమవిభూషితంబును బహు
ప్రస్రవణోపేతంబును సింహశార్దూలాధ్యుషితకందరంబును స్వాదుమూలఫలో
దకంబు నగునప్పర్వతోత్తమం బారోహించి రామదర్శనశీఘ్రహర్షప్రచోదితుం
డై మహోదధియుత్తరతీరంబు సేరంగోరి ప్రావృట్కాలవలాహకంబుకరణి మేనుఁ
బెంచి మీనోరగనిషేవితం బగుసముద్రమార్గమునం జూడ్కి నాటించి మారుతజ
వంబున కెగయ సమకట్టి పాదద్వయంబు పర్వతాగ్రంబుపై మోపుటయుఁ దత్క్షణంబ.
| 1242
|
హనుమంతునిపాదఘట్టనంబున నరిష్టపర్వతము నుగ్గునూచ మగుట
| క. |
పావనిపాదాక్రాంతము, లై విఱిగి మహోపలంబు లతిగంభీరా
రావంబులతోఁ జూర్ణము, లై వడి గిరిసానుతలములందుం గూలెన్.
| 1243
|
| చ. |
హరివరుపాదఘాతమున నట్టిటు శైలము కంప మొంద జం
భరిపునిహేతిచేఁ దెగినభంగి మహోన్నతశృంగసంఘము
ల్పరువడి వ్రస్సి కూలె ఘనపాదపకోటికుఠారధారచే
నఱికినకైవడి న్విరులు నల్గడలం బడ వ్రాలె నేలకున్.
| 1244
|
| చ. |
అతులితసత్త్వుఁ డయ్యనఘుఁ డంఘ్రులు మోపినయంతమాత్రఁ బ
ర్వతవరకందరాంతరనివాసిమహోగ్రమృగేంద్రసంఘముల్
గతి సెడి పీడితంబు లయి కాతరతన్ మదగంధవారణ
|
|