| క. |
సూరిజనవినుత ధారుణి, ధీరుఁడు తగ వృద్ధి నొందుధీరుఁ డధికుఁ డౌ
ధీరునకు సర్వకార్యము, లారూఢిం గూడి వచ్చు ననవరతంబున్.
| 107
|
| తే. |
అనఘ నీయట్టి కాల పర్యాయకోవి,దుండు ధీరుండు సంప్రాప్తదుఃఖములకుఁ
దలఁకక సహించి యుండు నుదగ్రవాత, వేగమున కద్రి తలఁకనివిధము తోఁప.
| 108
|
| ఆ. |
శక్రతుల్యవీర్యసంప్రాప్తదుఃఖంబు, నవలఁ ద్రోయఁజాల కనవరతము
వంత నొందు టెల్ల స్వల్పశేముషి యైన, నీచుగుణము గాక నీగుణంబె.
| 109
|
| చ. |
కరగతరాజ్య మంచితసుఖం బతిమానుషభోగవైభవో
త్కరముఁ బరిత్యజించి ఘనతాపసవేషముఁ దాల్చి కాన క
ట్లరుదుగ నేఁగుదెంచినమహాత్ముఁడ వీవు నరేంద్ర నీచకా
పురుషునిమాడ్కి ధైర్య మటు పోని మోహము నొందఁ జెల్లునే.
| 110
|
| క. |
అలఘుచరిత్ర వివేకము, గల పురుషుఁడు లోభమోహకామాదిగుణం
బుల నాఁగి పట్టుఁ బ్రజ్ఞా, బలమున సూతుండు హరులఁ బట్టినమాడ్కిన్.
| 111
|
| తే. |
మానవేశ్వర నీవు సుజ్ఞాననిధివి, ధైర్యసంయుక్తుఁడవు ప్రమాద్యంబు లైన
విషయములయందు హృదభినివేశనంబుఁ, జేసి యిబ్భంగి శోకింపఁ జెల్లదయ్య.
| 112
|
| వ. |
మహాత్మా నీవు మహానుభావుండవు మహనీయశుభచరిత్రుండవు దివ్యబోధప్ర
భావుండవు నాయట్టియజ్ఞానికి వివేకంబుఁ దెలుపునట్టివిచక్షణుండవు ప్రకృతి
జనంబులభంగిఁ గామాదివికారంబులం బరిభ్రమింప నర్హుండవు గావు తొల్లింటి
తాల్మి వహింపుము వనవాసంబు నిర్వర్తించి భార్యాపహారకుం డగుపగతునిం
బరిమార్చి వైదేహిం జేకొని క్రమ్మఱ నయోధ్యకుం జని యందు మహోన్నతం
బైనసామ్రాజ్యంబు పరిపాలించుచు మత్సహాయుండవై సుఖంపుము పరాక్రమ
ధుర్యుండ వైననీకు విప్రకారంబుఁ గావించినదురాత్ముని కొంతకాలంబు డగ్గ
ఱియె నంతె కాక బ్రతుకం గలఁడే యని పలికి లక్ష్మణుం డన్నరపతిచిత్తంబు
ధైర్యాయత్తంబు గాకునికి విచారించి వెండియు నిట్లనియె.
| 113
|
| సీ. |
అమలాత్మ నీప్రభావము నీ వెఱుంగక శోకించె దిట్లేల శూరవరుల
కింతదైన్యము చెల్లునే సతీవిరహజనితదుఃఖమున నామతము వినవు
క్షితిసమార్ద్రయు నతిస్నేహసంబంధమువలన దహింపంగఁబడును వర్తి
గావునఁ దద్వియోగజదుఃఖముఁ దలంచి విడు మతిస్నేహంబు ప్రియులయందు
|
|
| తే. |
సీతతోఁ గూడ పాతాళసీమయందు, దితిజఠరమందు డాఁగిన నతిరయమున
దితిజు వధియించి సీతను దెచ్చి యిత్తు, వీరశేఖర దైన్యంబు విడువు మింక.
| 114
|
శ్రీరాముఁడు శోకమోహంబు లుడిగి లక్ష్మణసహితముగా సుగ్రీవునిం జేరఁబోవుట
| వ. |
దేవా శోకంబు సకలార్థనాశనకారణంబు గావునఁ గార్యార్థి యగువానికి శో
కంబు కొఱ గాదు నీయట్టి మహాత్మున కిట్టి మందబుద్ధి దొరకొనిన మముబోంట్ల కెల్ల
నేమి యగు నష్టకార్యరూపప్రయోజను లగుపురుషుల కర్థంబు ప్రయత్నంబునం
|
|