Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/335

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


తే.

రత్నసంయోగసంస్కృతరాజపీఠ, మున సుఖాసీనుఁ డై శుభబుద్ధు లైన
యాప్తులు భజింప సురయుతుం డైననిర్జ, రోత్తమునిభంగి నిండుగొ ల్వున్నవాని.

1111


వ.

మఱియు మేరుశిఖరంబునందు సునిష్ఠితం బైనసజలం బగుజలదంబుమాడ్కి
ననంతరత్నప్రభాభాసురం బైనయాస్థానసదనమంటపోపరిభాగంబున నుప
విష్ణుం డైనదశగ్రీవు నవలోకించి తత్తేజంబున మోహితుం డగుచు రాక్షసుల
చేతఁ బీడ్యమానుం డయ్యును సరకుగొనక పరమవిస్మయవ్యగ్రమానసుం డై
తనమనంబున.

1112


శా.

ఆహా వీనియుదగ్రరూపవిభవం బాహా భుజావిక్రమం
బాహా వీనియనంతసత్త్వము సముద్యద్భూరతేజోజయో
త్సాహంబు ల్సకలాంగయుక్తతయు దాక్ష్యంబున్ మతిస్థైర్యము
న్బాహాగర్వము ధాత్రియందుఁ బరిగించం గాన మెవ్వారికిన్.

1113


చ.

ఒనరఁగ వీనియందు గుణ మొక్కటి తక్కువ యయ్యెఁ గాక గ
ల్గిన బలసూదనప్రముఖలేఖనికాయము నైన నేలఁ జా
లినబలశాలి వీఁ డలుక లేచి చరించిన భూతధాత్రి నం
బునిధితరంగమాలికల ముంపఁగ నోపఁడె యొక్కవ్రేల్మిడిన్.


చ.

ఇతనినృశంసకర్మమున కెంతయు నిర్జరయక్షపన్నగ
ప్రతతులు మర్త్యకోటులు నృపాలురు సౌఖ్యము గాన కార్తు లై
ధృతి చెడి యున్నవా రధికధీరుఁడు రాఘవుఁ డెన్నఁ డాజిలో
నితని వధించి లోకముల కిచ్చు ననామయసౌఖ్యసంపదల్.

1114


క.

అని బహుభంగుల మారుత, తనయుఁ డమితసత్త్వు, డైనదనుజాన్వయవ
ర్ధనునిప్రభావముఁ గనుఁగొని, తనమది విస్మయము దోఁపఁ దలఁచుచునుండెన్.

1113


వ.

అప్పుడు దురాత్ముం డగురాక్షసేశ్వరుండు తేజోదృతుండై తనముంగల నున్న
సింగాక్షుం డగువృక్షచరశ్రేష్ఠుని రోషారుణితలోచనంబుల నిరీక్షించి యేను
దొల్లి కైలాసనగంబు భుజాగర్వంబునఁ జలంబు మెఱయఁ బెకలించునాఁ
డెవ్వనిచేత శప్తుండ నైతి నట్టిభగవంతుం డైనశంకరుకింకరుం డగుసాక్షాన్నంది
కేశ్వరుండు నేఁ డిట్లు కపిరూపధరుఁడై చనుజెంచెనో యనియును బలిపుత్రుం
డగుబాణాసురుం డరుగుదెంచెనో యనియును చింతించి శంకాహతాత్ముం డై
మంత్రిసత్తముం డగుప్రహస్తు నవలోకించి కాలయుక్తంబును విపులార్థవంతం
బు నగువాక్యంబున ని ట్లనియె.

1117

రావణనియోగంబునఁ బ్రహస్తుఁడు హనుమంతుని లంకాగమనాదికారణం బడుగుట

ఉ.

ఎవ్వఁడు వీఁడు మత్పురికి నెవ్వఁడు పంపఁగ వచ్చి లంక తా
నెవ్విధిఁ జొచ్చె నాదువన మేటికి భగ్న మొనర్చె దైత్యులం
గ్రొవ్వున నేల చంపె సరకుం గొన కేల రణంబుఁ జేసె మీ