| |
వీనిమహత్త్వంబు వీనిసామర్థ్యంబు వసుధలో నింక నెవ్వరికిఁ గాన
|
|
| తే. |
మరయ నాయత్న మంతయు వ్యర్థ మయ్యె
నొనర నీయస్త్రము పునఃప్రయోగమునకుఁ
బనిగొనదు వేఱువిధమునఁ బట్టువడఁడ
యితని సాధించుట కుపాయ మెద్దియొక్కొ.
| 1106
|
| వ. |
అని కొండొకసేపు వితర్కించి యివ్వానరుండు తనయస్త్రబంధమోక్షం బెఱుంగ
కున్నవాఁడు బద్ధుం డగునితని నుపాయంబునం గొనిపోయెదఁ గాక యని నిశ్చ
యించి మేఘనాదుండు దీర్ఘశృంఖలంబుచేత మత్తమాతంగంబుం గొనిపోవు
కరణి నతిప్రయత్నంబున హనుమంతు నాకర్షించుకొని కోలాహలబహులం
బుగా నరిగి మంత్రిబాంధవపరివారపరివృతుం డైనరావణునకు సమర్పించె
నప్పుడు మరున్నందనుండు.
| 1107
|
హనుమంతుఁడు రావణునిఁ జూచి వితర్కించుట
| సీ. |
తపనీయరుచిరముక్తాజాలసంవృతాయతకిరీటముచేత నలరువాని
వరవజ్రగర్భితస్వర్ణకుంతలవిభాకలితకపోలభాగంబువాని
హాటకరత్నచిత్రామలసుమహార్హహారశోభితగాత్రుఁ డైనవానిఁ
గాంచనమయమంజుకౌశేయశోభితమహనీయపృథునితంబంబువాని
|
|
| తే. |
హరితచందనదిగ్ధాంగుఁ డైనవాని, నమితమాల్యోపశోభితుం డైనవాని
మద్యసేవాసముద్భూతమదవిఘూర్ణ, మానశోణితనేత్రాంతుఁ డైనవాని.
| 1108
|
| మత్తకోకిల. |
దీప్తవక్త్రుని ఘోరదంష్ట్రు నతిప్రసన్నబలుం బయో
జాప్తతేజు నుదగ్రపౌరుషు నంజనాచలతుల్యు సం
తప్తకాంచనమండనాద్యు నుదారశౌర్యు సమగ్రసం
ప్రాప్తరాక్షసరాజ్యవైభవు నత్యుదాత్తు యశోనిధిన్.
| 1109
|
| వ. |
మఱియు నానావ్యాళసమాకీర్ణంబు లైనశిఖరంబులచేత నలరుమందరంబుకరణి
ననర్ఘమణిగణప్రభావీచీసమిచీనకోటీరసమలంకృతంబు లైనపదిశిరంబులచేత
విరాజమానుం డగువాని నమరేంద్రవారణవిషాణాగ్రపరిపీడనకృతవ్రణవక్ష
స్స్థలుం డగువాని శరత్కాలరాకానిశాకరమండలమండితం బైనవదనంబు
చేత విశాలోరస్స్థలవిరాజమానం బగుహారంబుచేతను సబలాకం బగుతో
యదంబుచందంబున నందం బగువానిఁ బంచశీర్షంబు లగుపన్నగంబులలీలం
గ్రాలువద్ధకేయూరకనకాంగదచందనోత్తమరూషితంబు లగుపీనాయతబాహు
వులచేత నొప్పువాని మఱియును.
| 1110
|
| సీ. |
ఇరుగెలంకుల నలంకృత లై సురాంగన ల్రమణీయమృదుచామరముల వీవఁ
దతబుద్ధిఁ గార్యమంత్రవినిశ్చయమునందు నతిదక్షు లై మంత్రు లనుసరింప
సందడి జడియఁ గాంచినక్షేత్రపాణు లై సారణశుకులు జోహారు సేయ
గుణదోషముల తెఱంగులు గణించుచు నయోజ్జ్వలులు విభీషణాదులు భజింప
|
|