Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గోచరుండు గాక చిత్రగతులం బరిభ్రమించుటయునుం దలపోసి సమాధి
సంయోగసమాహితాత్ముండై తనమనంబున.

1102

ఇంద్రజిత్తు హనుమంతుని బ్రహ్మాస్త్రముచే బద్ధునిఁ గావించుట

ఉ.

వీనిభుజావిజృంభణము వీనివిచిత్రగతిప్రమాణముల్
వీనిపరాక్రమక్రమము వీనిజయోచితజన్యదాక్ష్య మె
వ్వానికి లేదు ముజ్జగమువారలలోపు వీఁ డవధ్యుఁ డె
ట్లే నితనిన్ రణంబున జయింపుదు నెద్ది యుపాయ మారయన్.

1103


మ.

అని చింతించి నిశాటరాజతనయుం డత్యంతసంరంభి యై
యనువందం ద్రిజగద్భయానకకరం బైనట్టిపైతామహం
బనుదివ్యాస్త్రము మౌర్వితో నియమమంత్రావృత్తి సంధించి పా
వనిపై నేసె సుపర్వు లార్వఁగ నిలింపద్వేషు లగ్గింపఁగన్.

1104


వ.

ఇ ట్లేసిన నయ్యమోఘాస్త్రం బనంతవిస్ఫులింగపటలీసంచారఘోరంబుగాఁ బఱ
తెంచి బ్రహ్మవచనంబు దలంచి మారుతిం జంప నొల్లక బద్ధుం గావించిన
నవ్వానరసింహుండు త్రిలోకపూజ్యబ్రహ్మాస్త్రపాశబద్ధుండై చేష్టలు దక్కి ధరణీ
తలంబునం బడి తనమనంబున నది బ్రహ్మాస్త్రప్రభావంబున నైనకృత్యంబుగా
నెఱింగి తొల్లి లోకపితామహుం డైనపరమేష్ఠి తనకు మెచ్చి యిచ్చినవరంబు
తెఱంగు విచారించి యమ్మహాత్మునియనుగ్రహంబువలనఁ దనకు బ్రహ్మాస్త్రంబు
వలనిభయంబు లేకుండుట తలపోసి సుస్థిరోత్సాహుండై యయ్యస్త్రబంధంబు
వలన నిడివడ సమర్థుం డయ్యును లోకగురుం డగుపరమేష్ఠి నవమానించుట
యుచితంబు గా దని నిశ్చయించి స్వాయంభువంబు లగుమంత్రంబులచేత నభి
మంత్రితం బగునమ్మహాస్త్రంబునకు లోనై యింక విక్రమంబున కుపక్రమింప
నుచితంబు గాదు బద్ధుండ నై యుండి రాక్షసులప్రభావంబును సర్వంబు నెఱింగి
రావణునితోడ సంవాదంబుఁ జేసి రామునిపరాక్రమశౌర్యసాహసోత్సాహంబు
తేటపఱతుఁ గాక యని నిశ్చయించి కపటదైన్యం బంగీకరించి రాక్షసులతర్జన
భర్షనోక్తులకు గర్జించుచు వినివృత్తచేష్టుండై యుండె నంత నవ్వానరోత్తము
రాక్షసులు కాష్ఠముష్టిప్రహారంబులఁ బీడించుచు భూనభోంతరంబు నిండ నా
ర్చుచు దృఢంబు లగుద్రుమచీరరశ్ములచేత నంటఁగట్టిన హనుమంతుండును బ్రహ్మా
స్త్రవిముక్తుం డయ్యె నది యెఱింగి దశాననతనయుండు తనమనంబున నిమ్మహా
స్త్రబంధం బన్యబంధము ననువర్తింపదు రాక్షసులు మంత్రగతి విమర్శించక
యితని బంధించిరి గాన నితం డస్త్రవిముక్తుం డయ్యె.

1105

ఇంద్రజిత్తు హనుమంతునిఁ దీనికొనిపోయి రావణునకు సమర్పించుట

సీ.

అకట యీదివ్యాస్త్ర మన్యభేద్యము గానియది సురాసురముఖ్యు లైనఁ గడువఁ
జాలరు వీఁ డెంత శక్తిసంపన్నుఁడో చటులబ్రహ్మాస్త్రపాశములవలన
విడివడి కుశలి యై విలసిల్లుచున్నాఁడు వీనిప్రభావంబు వీనిలావు