| |
ల్చచ్చి రనేకమత్తగజసప్తిశతాంగభటప్రతానముల్
చచ్చెను నీసహోదరుఁ డసాధ్యుఁడు నక్షుఁడు చచ్చె వ్రేల్మిడిన్.
| 1094
|
| క. |
అరిభంజన నీకుం గల, వరశౌర్యం బస్త్రబలము వారికి లేమిన్
దురమునఁ జచ్చిరి గా కీ, వరిగిన ముజ్జగము లయిన నడ్డము గలదే.
| 1095
|
| సీ. |
పవనునివేగంబు పావకువేఁడిమి తపనునితేజంబు దానవారి
శౌర్యంబు నీయం దవార్య మై వర్తిల్లు నత్తెఱం గెఱిఁగి దివ్యాస్త్రబలము
గనుఁగొని కార్ముకకౌశలంబు దలంచి కపిసమర్థతయు విక్రమము బలము
మహిమ విచారించి సహజబలంబున కనురూప మైనశౌర్యంబు దాల్చి
|
|
| తే. |
రాజధర్మంబు సమరధర్మము నెఱింగి
దేశకాలప్రవృత్తులతెఱఁగుఁ జలిసి
జయము గోరుచు నాత్మరక్షణమునందు
నేమఱక వైరి నిర్జింపు మేపు మీఱ.
| 1096
|
ఇంద్రజిత్తు హనుమంతునిమీఁదికిఁ బోవుట
| వ. |
మఱియు నీవు రణంబునకుం జని స్వపరబలతారతమ్యం బిమ్ముగా విచారించి బల
క్షయంబు గాక మున్నె వైరిం బరిమార్పు మయ్యగచరుండు కాలాగ్నికల్పుం
డు గావునఁ బాణితలముష్టిప్రహరణాదులచేత వధించుటకు శక్యుండు గాఁడు వానికి
వాయువునకంటె నధికజవంబు గలదు గావున వానియందు సైన్యంబులు పని
గొన వలసారం బైనవజ్రంబు గొని ప్రవేశింపకుము నా చెప్పినయర్థం బంతయు
మనంబునం దలపోసి స్వకార్యసిద్ధికొఱకు నేకాగ్రచిత్తుండ వై దివ్యాస్త్రబలం
బు సంస్మరించుచు నిజవైరివధం బాపాదింపు మేను బాలుండ వగునిన్ను రణం
బునకుం బంపు టది యుక్తంబుగా దైన నిది రాజనీతిజ్ఞుం డైనక్షత్త్రియునకు
సమ్మతం బగుటం జేసి నిన్నుఁ బుత్తెంచుచున్నవాఁడ సంగ్రామంబున నీకు
నానాస్త్రంబులయందు వైశారద్యంబు గలదు గావున నవశ్యంబు రణంబు
గావింపుము సంగరంబునందు విజయంబు ప్రార్థనీయంబు గదా యని పలికిన
నయ్యింద్రజిత్తుం డిష్టంబు లగుస్వగుణంబులచేతం బ్రతిపూజితుండై యతనికిం
బ్రదక్షిణంబును బ్రణామంబునుం గావించి వీడ్కొని యుద్ధోద్ధతకృతోత్సా
హుండై పర్వకాలంబునందు సముద్రంబుభంగి నుప్పొంగి నిజతేజోవిశేషం
బునఁ జూపఱవిలోకనంబులకు మిఱుమిట్లు గొలుపుచుఁ గెంజాయ రంజిల్లునే
త్రంబు లెఱ్ఱనివిరిదామరలం దెగడ నుదీర్ణవిక్రముండై గరుడానిలతుల్యవేగం
బు లగుహయంబులం బూన్చినయరదం బెక్కి కాంచనవలయమండితం బగు
చాపంబును శితశల్యంబు లగుసాయకంబులును ధరించి మండలీకృతకోదండుం
డై పరివేషపరివృతుం డగుసూర్యునిచందంబునం దేజరిల్లుచు గోదండపాండి
త్యంబు మెఱయ నారి మొఱయించుచు శంఖభేరీమృదంగపటహకాహళాది
వాద్యనిర్ఘోషంబులు బోరుకలఁగఁ జతురంగసేనాపరివృతుండై శతాంగరథాంగ
|
|