| చ. |
కర మురుశక్తి వానికడకాళ్ళును రెండును బట్టి వీఁకతో
గరుడుఁ డమోఘలీల నురగంబును వీచినమాడ్కి ఘోరబం
ధురమహనీయదోర్బలము తోరముగా వడి వేయిమాఱు లం
బరమునఁ ద్రిప్పి ధాత్రిఁ బడవైచె సుర ల్వెఱఁగంది చూడఁగన్.
| 1089
|
| వ. |
ఇట్లు విసరి వైచిన నయ్యక్షకుమారుండు తత్క్షణంబ భగ్నబాహూరుశిరోధరుం
డును వికీర్ణబంధనుండును వివృత్తనయనుండును జూర్ణితాస్థిసందోహుండునై
పంచత్వంబు నొందె ని ట్లక్షుని సమవర్తిసమీపవర్తిం జేసి హనుమంతుండు తక్కిన
చతురంగబలంబులఁ గాలం గేల మర్దించి తనమహాద్భుతపరాక్రమప్రకారంబుఁ
జూచి సిద్ధసాధ్యరక్షోయక్షగరుడగంధర్వాదులు దిక్పాలసహితంబుగా మిన్ను
నం జన్ని బహుప్రకారంబుల వినుతించుచుండ మరలి యెప్పటియట్లు తోరణం
బెక్కి ప్రజాక్షయంబునందుఁ గృతక్షణుం డైనకాలునిపోలికి నతిరౌద్రదర్శ
నుండై శత్రువధంబున కుత్సహించుచు నుండె నంత నక్షకుమారుండు మారుతి
చేతఁ జచ్చుట విని దశకంఠుండు శోకరోషవిషాదంబులు మనంబున ముప్పిరిగొన
నింద్రకల్పుం డగునింద్రజిత్తు నవలోకించి యి ట్లనియె.
| 1090
|
రావణుఁడు హనుమంతునిమీఁదికిఁ బోవ నింద్రజిత్తున కాజ్ఞాపించుట
| సీ. |
నీ వస్త్రవిదుఁడవు నిఖలాస్త్రవిదులలో నగ్రగణ్యుఁడవు సురాసురులకు
శోకదాతవు జన్యశూరుండ వంబుజూసనసమారాధనసంచితాస్త్రుఁ
డవు పరాక్రమధనుండవు దేశకాలవిభాగజ్ఞుఁడవు రణపండితుఁడవు
భుజవిక్రమాభిగుప్తుఁడవు తపోబలరతుండవు చాపదీక్షితుఁడవు
|
|
| తే. |
కడఁగి సంగ్రామతలమునఁ గాలవరుణ, దివిజవరు లాదిగాఁ గల్గు దేవసిద్ధ
చారణాదిత్యవసురుద్రసాధ్యు లైన, నీదుబాణోద్ధతి సహించి నిలువలేరు.
| 1091
|
| ఉ. |
ఆహవనైపుణంబున సమంచితమంత్రవినిశ్చయంబున
న్బాహుబలంబునం జతురుపాయబలంబుల ఘోరశాత్రవ
వ్యూహవిభేదనంబున సమున్నతవిక్రమశౌర్యసాహసో
త్సాహముల భవత్సముఁడు ధారుణి నెవ్వఁడు లేఁడు చూడఁగన్.
| 1092
|
| వ. |
పుత్రా నీకు యుద్ధంబులందుఁ బురుషకారంబుచేత శక్యంబు గానిది లేదు వివేక
పూర్వవిచారంబునందు నీ కవిదితం బైనకార్యం బెద్దియు లేదు భవదీయాస్త్ర
బలశారీరంబు లెఱుంగనివాఁడు ముల్లోకంబులయం దొక్కండైన లేఁడు నీకుం
గలతపోబలంబును బరాక్రమంబును దివ్యాస్త్రబలంబు నెవ్వరికిం గానము రణ
సంకటంబులందు మదీయచిత్తంబు నిన్నుం దలంచి నిశ్చితవిజయరూపప్ర
జనం బై విషాదంబు నొందదు వినుము.
| 1093
|
| ఉ. |
అచ్చుగఁ గింకరు ల్నిహతు లైరి బలాఢ్యుఁడు జంబుమాలియుం
జచ్చె నమాత్యనందనులు చచ్చిరి పంచబలాధినాయకు
|
|