Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యుతముగ వేడుక ల్సలుపుచున్నవి కంటివె దుఃఖితుండనై
ధృతి చెడి యున్ననాకు వలఱేని వికారము గల్గఁజేయుచున్.

93


తే.

దశరథకుమార చిత్రపతత్రికలిత, మైన యీరమ్యపర్వతసానువందు
భామినీమణి నాకుఁ గన్పట్టెనేని, యవల నాచిత్తమునకు స్వాస్థ్యంబు గలుగు.

94


క.

రవికులవర్ధన యిప్పుడు, ధవళేక్షణ నన్నుఁ గూడి తప్పక పంపో
పవనసుమగంధబంధుర, పవనుని సేవించెనేని బ్రదుకుదుఁ గాదే.

95


తే.

పద్మసౌగంధికయుతుండు పావనుండు, శోకనాశనుఁ డత్యంతసుఖకరుండు
నైనపంపోపవనపవమానుసేవ, దొరకొనుట యెట్టివారికి దుర్లభంబు.

96


క.

అనఘుఁడు ధర్మవిచారుఁడు, జననాథుఁడు సత్యరతుఁడు జనకుఁడు కృపతో
వనజాక్షి సేమ మడిగిన, ననఘా యేనుందు నమ్మహాత్మునితోడన్.

97


తే.

తండ్రిపంపున రాజ్యంబు ధనము విడిచి, యడవి కరుదెంచుచున్నన న్ననుసరించి
వచ్చె నేదేవి యడవికి వదల కట్టి, రమణి లేకున్న నేగతి బ్రతుకువాఁడ.

98


క.

జలజాతనేత్ర మవ్రణ, మలకాభివిరాజితంబు నగుతన్ముఖముం
జెలు వలరఁ జూడకుండుట, వలన న్నామనము దుఃఖభాజన మయ్యెన్.

99


క.

స్మితహాస్యాంతరయుతమును, హిత మతులము మధుర మమృతహిత మగుధాత్రీ
సుతవాక్య మింక నెన్నఁడు, వితతగుణావీను లలర విన నగు నాకున్.

100


ఉ.

ఒక్కొకవేళ మన్మథశరోద్ధతి స్రుక్కెడునన్నుఁ జూచి దా
నెక్కుడు శ్రాంత యయ్యు హృదయేశ్వర యేల కృశించె దీవటం
చొక్కటఁ గౌఁగిలించి మధురోక్తుల నెవ్వగఁ దీర్చుచుండు నేఁ
డెక్కడ కేఁగె నట్టి హృదయేశ్వరి నన్నిటఁ బాసి లక్ష్మణా.

101


తే.

సీత యెచ్చట నున్నది చెప్పు మనుచు, నడుగఁ గౌసల్యతోడ నేమందు నింక
దేవి పోయిన తెరువునఁ బోవువాఁడ, ననఘ భరతునిఁ జూడ నీ వరుగు మిపుడు.

102


చ.

అని బహుభంగుల న్సముదితార్తరవంబునఁ దత్తఱించుచు
న్వననిధియందుఁ దొట్రుపడునావవిధంబున శోకపారము
న్గనుఁగొనలేక పుష్పశయనంబున దీనత వ్రాలియున్నయ
న్నను గని లక్ష్మణుం డనియె నవ్యసుధామయమంజులోక్తులన్.

103

శ్రీరాముని లక్ష్మణుఁ డూఱడించుట

తే.

ఘనతరం బగువాయువేగంబుచేతఁ, గిన్నరిని గూర్చి విలపించుకిన్నరుండుఁ
బోలె దేవరూపంబుచేఁ బురుషవర్య, మిగుల సీత నుద్దేశించి వగచె దీవు.

104


తే.

అట్టిలావణ్యవతి, బాసినట్టిచోట, శోకము జనించుటకు నేమిచోద్య మధిప
సర్వముఁ బరిత్యజించి నిసర్గధర్మ, మరసి సేవించు టది శాస్త్రసరణి కాదె.

105


క.

అనఘాత్మ ధర్మరతుఁ డగు, జనునకు దుర్లభము లేదు జగతి నొకింతై
నను స్థిరచిత్తునిధర్మం, బున కొన్నఁడు నొక్కహాని పుట్టదు తలఁపన్.

106