Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/328

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నప్పుడు రావణకుమారుండు వీర్యదర్పితుండును బ్రవృద్ధమన్యుండును క్షతజోప
మేక్షణుండును జారుకుండలమండితగండభాగుండు నుదగ్రచిత్రాయుధచిత్ర
కార్ముకుండును నై గజంబు తృణసంవృతం బైనకూపంబునుం బోలె నసమాన
వీర్యుం డగువానరవీర్యునిం గదియ నడిచె నిత్తెఱంగునం జనుదెంచునక్షకుమా
రునిం జూచి వృక్షచరశ్రేష్ఠుండు మత్తమాతంగంబుఁ గన్నసింగంబుభంగి
నుప్పొంగి భూనభోంతరంబు నిండ గర్జించుచు సమరంబున కభిముఖుం డయ్యె
న ట్లొండొరులతోడ మార్కొనం బూని యున్నయన్నిశాచరవనచరశ్రేష్ఠుల
సమాగమంబు సురాసురసంభ్రమప్రదంబై చెల్లె మఱియును.

1075

అక్షుఁడు హనుమంతునితో యుద్ధము సేయుట

సీ.

నిండార దిననాథుఁ డెండ గాయక యుండె వేడ్కతోఁ బవనుండు వీవకుండె
వీతిహోత్రుఁడు తనవేఁడి సూపకయుండె నింపుగా జలధి ఘోషింపకుండె
ఖేచరవితతి సంక్రీడ సల్పక యుండె సురవిమానశ్రేణి దిరుగకుండె
సదమలకల్లోలనదులు పాఱక యుండె గ్రహగణంబులు మింటఁ గదలకుండె


తే.

భూమి కంపించెఁ బర్వతంబులు వడంకె
నభము ఘూర్ణిల్లె దిక్కులప్రభ దొలంగె
వీఁకతో నక్షుఁ డక్కపివీరవరుఁడు
దారుణంబుగ నొండొరుఁ దాఁకునపుడు.

1076


క.

ఇత్తెఱఁగున మార్కొనుటయు, నత్తఱి దశకంఠసుతున కటవీచరవం
శోత్తమునకుఁ గయ్యంబు వి, యత్తలమున నద్భుతావహంబై చెల్లెన్.

1077


క.

మున్నెన్నఁ డిట్టి కయ్యము, గన్నది లే దనుచు దేవగంధర్వాదుల్
మిన్నున నతివిస్మితు లై, యున్నతమతి సన్నుతించుచుండిరి మిగులన్.

1078


వ.

ఇట్లు భువనభయంకరంబుగాఁ దలవడి పోరాడు నప్పుడు.

1079


చ.

అతిరథవర్యుఁ డైనదనుజాధిపసూనుఁడు చిత్రకాంచనో
న్నతపృథుకార్ముకంబు వితతంబుగ నజ్యము చేసి మేఘ ము
ద్ధతిఁ గుధరంబుమీఁద జలధారలు వే దొరఁగించునట్లు మా
రుతిపయిఁ దీవ్రబాణములు రోషమునం దొరఁగించి వెండియున్.

1080


క.

తనవింటినేర్పు లోకులు, వినుతింపఁగఁ గూర్చుటయును వెస నేయుటయున్
గన రాకుండఁగ గగనము, ఘనతరనారాచమయము గావించి తగన్.

1081


వ.

మఱియుఁ గాలవ్యాళసన్నిభంబు లగుమున్నూఱుబాణంబులు లలాటం
బునఁ గాంచనపుంఖంబు లగునూఱుశరంబు లురంబునఁ దీక్ష్మాగ్రంబు లగునేఁబది
సాయకంబులు భుజంబుల నేనూఱు వెడందవాతియమ్ములు తనువునం గీలించి
తనచేతిబలువు సూపిన నవ్వానరసింహుండు రక్తధారాసారోక్షితశరీరుండై
నవార్కునితెఱంగున వెలుంగుచు సమీరణునిమాడ్కి శరమధ్యంబున మెలం