Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

నాకు ద్రోహముఁ బుట్టఁ జేయుచు మహానందానురాగంబుతో
నీ కారండవ మంగనాయుతముగా నీనీటిలోఁ జొచ్చి య
స్తోకాంభోరుహషండమండలములందుం గ్రీడఁ గావించె నీ
వాకర్ణింపుము తత్కలస్వనము సొంపారంగ వీ తెంచిడిన్.

83


తే.

ఇనకులోత్తమ విను మిట్టి హృద్యరూప, మెలమి మందాకినికిఁ గల్గెనేని జగతి
నధికవిఖ్యాతదృష్టిచిత్తాపహారి, గుణము లన్నియు దానికిఁ గూర్పవచ్చు.

84


తే.

ఇట్టిరమ్యవనంబున నిట్టివేళ, నుత్పలేక్షణ నాయొద్ద నుండె నేని
యుష్ణకరవంశతిలక యయోధ్యనైన, నింద్రపదమైనఁ దృణముగా నెంతుఁగాదె.

85


ఉ.

ఆమదిరాయతాక్షి జనకాధిపనందినిఁ గూడి యిచ్చట
న్గోమలశాడ్వలంబుల నికుంజముల న్విహరింపఁ గల్గిన
న్దామరసాసనాదులపదంబులలోఁ గలసౌఖ్య మైనచో
నామది కించు కైన నరనాథతనూజ ప్రియంబు సేయునే.

86


క.

ఈకాననమున వివిధా, నోకహములఁ జూడు మతిమనోహరభంగి
న్నాకుం జిత్తభ్రమణం, బీకరణి నొనర్చుచున్న విపుడు కుమారా.

87


తే.

అనఘ రమ్యాద్రిగిరిసానులందు మోద, మలరఁ గ్రీడించుమృగదంపతులను జనక
కన్య నెడఁబాసినమిగులదుఃఖమునఁనగుందు, చున్ననన్ను విలోకింపు మురుగుణాఢ్య.

88


క.

ఈరమ్యతరులు కుసుమము, లీరాజితపల్లవంబు లీసరసులు నా
కేరీతిఁ బ్రియ మొనర్చును, నీరజదళనేత్ర నెదను నిల్పిన దాఁగన్.

89


సీ.

శుకవాణిమెయితావి సోఁకినప్పుడు గదా యీమందపవమానుఁ డింపొనర్చుఁ
గలకంఠికనుదోయిఁ గాంచినప్పుడు గదా యీపద్మపత్రంబు లింపొనర్చు
సుందరిచనుదోయిఁ జూచినప్పుడు గదా యీచక్రవాకంబు లింపొనర్చు
మదిరాక్షికెమ్మోవి గదిసినప్పుడు గదా యీజపాకుసుమంబు లింపొనర్చు


తే.

జలదవేణికతోఁ గూడి వలసినట్టు, అనుదినంబును విహరించునప్పుడు గద
యిచటివస్తువు లన్నియు నింపొసర్చుఁ, గానిచో దుఃఖకరములు కావె నాకు.

90


వ.

మఱియు నీపుష్కరిణి సుశీతలస్వాదుసలిలయై సంఫుల్లహల్లకపద్మకైరవాలంకృ
తయై చక్రవాకానుచరితయై కారండవనిషేవితయై క్రౌంచప్లవసంపూర్ణయై
వరాహమృగసేవితయై కలస్వనంబులు సేయు వివిధముదితవిహంగమంబులచేత
నభిసంవృతయై నాకుఁ గామోద్దీపనంబు సేయుచు నదృష్టపూర్వశోభావిశే
షంబున నతిరమణీయంబై ప్రకాశించుచున్నది విలోకింపుము.

91


తే.

పద్మనేత్రయు శ్యామయు భద్రకరటి, యానయు వినీలవేణియు నగుధరిత్రి
కన్యకను బాసి మేన నేకరణి నిపుడు, ప్రాణములు దాల్చి యుందు భూపాలతనయ.

92


చ.

క్షిత్రివరపుత్త్ర ముంగల విచిత్రవిశాలమహీరుహాభిశో
భితగిరిసానుదేశములఁ బ్రీతి దలిర్ప మృగంబు లంగనా