Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/314

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శోకలతాప్రతానం బై యుండె వృక్షభంగస్వనంబున లంకానివాసు లగురాక్షసు
లందఱుఁ ద్రాససంభ్రాంతు లై రిత్తెఱంగున మహాతేజుండును మహాసత్త్వుం
డును మహాబాహుండును మహాబలుండు నగుమహాబలనందనుండు ప్రమ
దావనంబు నిర్మూలంబు చేసి రావణున కత్యంతవ్యళీకంబు సంపాదించి రాక్ష
సులకు భయావహం బైనశరీరంబు వహించి నిజతేజోజాలంబు గగనలక్ష్మికిం
బీతాంబరత్వంబు సంపాదింపఁ దోరణారూఢుండై శంకింపక మహాబలు లైన
పెక్కండ్ర రక్కసులతోడ నుక్కున నొక్కండె రణంబు సేయ సమకట్టి
యద్భుతప్రతాపంబునం దేజరిల్లుచు రాక్షసులరాక కెదురు సూచుచుండె
నప్పుడు.

973

రాక్షసాంగనలు మేల్కని సీతను వనము విఱిచినవాఁ డెవ్వఁ డని యడుగుట

మ.

తరుభంగస్వనము ల్భయంకరఖగధ్వానంబు లాలించి ము
ష్కరదైత్యాంగన లెల్ల మేల్కని వినష్టం బైనయుద్యానమున్
గిరితుల్యున్ హరివీరు ఘోరబలుఁ బంకేజాప్తసంకాశు వా
నరవీరున్ హనుమంతుఁ గాంచి భయసంత్రస్తాత్ము లై యందఱున్.

974


చ.

జనకజ డాయ నేగి కడుసంబర మొందుచు సీత యెవ్వఁ డీ
వనచరుఁ నేటి కిచ్చటికి వచ్చెను నీ విపు డేల వీనితోఁ
బనివడి మాట లాడితివి బాగుగ నేమి శుభంబు దెల్పె మం
తనముగ నెవ్వఁ డంపె నిది దాఁచక మా కెఱిఁగింపు మెంతయున్.

975


వ.

అనిన విని వైదేహి వారి కిట్లనియె.

976


చ.

తఱుచుగఁ గామరూపు లగుదైత్యులమాయలు మీకె గాక నా
తరమె యెఱుంగఁ బాములపదంబులు పాములె గా కెఱుంగ నొం
డొరులకు శక్యమే యితని నొక్కనిశాటునిఁ గాఁ దలంచి ని
వ్వెఱపడి యున్నదాన నను వెండియు మీ రిటు లేఁచ నేటికిన్.

977


వ.

అనిన నద్దానవాంగనలు భయంబున సీతం గాచికొని యుండిరి కొందఱు భీమ
రూపుం డగుహనుమంతునిపరాక్రమప్రకారంబు రావణున కెఱింగించువారై
యతిత్వరితగమనంబున రావణునొద్దకుం బఱచి వికృతానన లై యిట్లనిరి.

978

రాక్షసాంగన లశోకవనభంగప్రకారమును రావణున కెఱింగించుట

సీ.

దనుజేంద్ర యెవ్వఁడో వనచరుఁ డొక్కఁడు మనయశోకారామమధ్యమందు
జనకజతోఁ గృతసంవాదుఁ డై భూరిభుజబలంబున భవద్ద్విజగణాయు
తం బైనవనము విధ్వస్తంబు గావించె నరయ నొక్కమహీజ మైన లేదు
భయదరూపమునఁ జూపరులకు విస్మయం బురుభీతి పుట్టించుచున్నవాఁడు


తే.

అనిమిషాధిపుఁ డంపెనో యముఁడు పంపె
నో కుబేరుఁడు పంపెనో లేక రాముఁ