Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


మెఱిఁగి పోవుట కర్జ మింతకు నారాక యెఱిఁగించి విక్రమవృత్తి దాల్చి
దనుజులతోడ యుద్ధముఁ జేసి శౌర్యంబు ధీరత్వమును లావు తేటపఱిచి


తే.

సమరమునఁ బంక్తికంఠుని శౌర్యవిద్య, సత్త్వబలగర్వములు వానిసాహసంబు
నాజినిపుణత హృదయస్థమైనమతము, సర్వము నెఱుంగనగు నాకు సంతసమున.

970


ఉ.

ఆరజనీచరేశు ప్రియ మైనవనం బిది నేత్రహారి యై
చారులతానికుంజతరుసంయుతమై యలనందనోపమం
బై రమణీయకాంతిఁ జెలువారుచు నున్నది చిచ్చు శుష్కకాం
తారము నట్లు దీనిఁ బరిణాశము నొందఁగఁ జేసెద న్వడిన్.

971


చ.

ఇటుల వనంబు భగ్న మగు టెంతయుఁ దా విని పంక్తికంఠుఁ డు
త్కట మగు కోపవేగమున దైత్యబలంబులఁ బంపు నాజికిం
జటులత నేగుదెంచి రభసంబునఁ దాఁకుదు రట్లు దాఁకినం
దటుకున వారిఁ జంపి సుపథంబున నేగెద రామునొద్దకున్.

972

హనుమంతుఁ డశోకవనము నంతయు విఱిచివైచుట

వ.

అని చింతించి యదియె కర్జంబుగా నిశ్చయించి యమ్మరున్నందనుండు శైలో
త్పాటనచాతురీధురీణుం డైనసమీరణునిభంగి వేగంబు వహించి ప్రావృట్కాల
వలాహకంబుకరణి మేనుఁ బెంచి కాలహుతాశనునిచాడ్పునఁ గ్రోధం బంగీకరించి
ప్రళయకాలమార్తాండమండలంబు పగిది ముఖమండలంబు గ్రాల రాక్షసక్షయ
నిమిత్తం బైనధూమకేతువుంబోలె లాంగూలంబు దనర ననంతబలసంపన్నుం
డై విజృంభించి వృక్షషండంబుల నుత్పాటింప నారంభించి యంబరోల్లిఖితశాఖా
శిఖాగ్రంబు లైనభూరుహంబులు బడలుపడం ద్రోయుచు లతావితానంబులం
ద్రెంచుచు నికుంజంబులు భంజించుచు సింహశార్దూలవరాహాదిగ్రూరమృగం
బులఁ బాఱందోలుచుఁ బర్వతాగ్రంబులు చూర్ణంబు సేయుచు వాపీకూపంబులు
పూడ్చుచు గంధసింధురంబులీల జలాశయంబులు చొచ్చి కలంచుచుఁ దామ్రకిసల
యక్లాంతంబు లైనకొమ్మలు విఱుచుచు లతాగృహచిత్రగృహశిలాగృహంబులు
విఱుగంద్రోయుచు ఫలంబులు రాల్చుచుఁ బుష్పంబు లున్మూలించుచు ని ట్లనేక
ప్రకారంబుల సీత యున్నశింశుపావృక్షం బొక్కటిదక్కఁ దక్కినవనంబంతయు
విధ్యస్తంబు గావించిన నవ్వనం బూరువేగసమున్మథితవృక్షంబును గ్లాంతద్రుమ
లతాయుతంబును బ్రభిన్నసలిలాశయంబును జూర్ణితపర్వతాగ్రంబును వినాశిత
క్రీడాగృహచిత్రగృహలతాగృహశిలాగృహంబును వ్యాకులితమహోరగవ్యాళ
మృగంబును సముత్పాటితలతాసమూహంబునై దావానలహతం బైనశుష్కా
రణ్యంబుపగిదిఁ బ్రణష్టరూపం బై యొప్పె మఱియు మృగపక్షిగణంబులు భయ
విత్రస్తంబు లై రాక్షసులకుఁ గ్రూరనిమిత్తంబులు దెలుపుచు వికృతస్వరంబున
విరావంబులు సేయుచుఁ బఱరందొడంగె మఱియుఁ బ్రమదావనం బైనదశవదన
ప్రమదావనంబు వికసితాశోకలతాప్రతానం బయ్యును హనుమద్బలంబువలన