280 గోపీనాథ రామాయణము సందర్శించి యమ్మహాత్తునితో నీవుదక్షిణ సముద్ర మధ్యంబున రావణ పాలితం బైన లంకాపురంబున రాక్షసీమధ్యంబునం జక్కి యున్న చందంబును భవద్దుఃఖంబు నుద్బంధనాది చేష్టి తంబును నేను వీను చుండ రావణుందిరస్ధరించుటయు నన్నియు నేర్పడ విన్నవించి శీఘ్రంబున లక్ష్మణసు శ్రీవసహితంబుగానిచ్చటికిం దోడ్కొని నచ్చెద రాముండు నమ్మునట్లుగా నొక్క యభిజ్ఞానం బొసంగు మని పలికిన నతని పలుకుల కలరి యదేవి రానుప్రత్యయార్థంబుగా నొక్క సందేశంబుఁ జెప్పెద దాని నావచనంబులు గా నమ్మహానుభావున కెఱింగింపు మని యిట్లనియె. ఎ. సీత హనుమంతునకు రామకృతకాక సంహారక్రమం బెఱింగించుట. శృతం సీ. మిత్రవంశో త్తమ చిత్రకూటాచల ప్రాంతపూర్వోత్తర పాదమందుఁ దనరుమందాకిని కనతిదూరంబున రమణీయఫలములకమల మైన సిద్ధాశ్రీత మగు ప్ర సిద్ధాశ్రమంబును బహుపుష్ప సౌరభ బంధురోప వనషండములయందు ఘనవిహారము సల్పి జలపరిక్లిన్న నై శ్రమము వాయఁ తే. బరఁగ నీయంకతలమునఁ ఒవ్వళించి,యుండ వాయన మొక్కటి గండుమాటి యన్మదీయ స్తనాంతర మందు విశిత, తుండమునఁజీరె భయమదిదొలఁగఁబెట్టి. తే. ఏను గరమల్లియొక లోష్టమెత్తి వేగ, నాయసముమీఁద వై చినఁ బాయకదియు నందెయుండిని తనఖాగ్రతుండ, ములవిదారించి నెంతయుఁ జలము మెఱయ. వ, ఇట్లు భక్ష్యలోలు సవాయసంబుచే విదారితనై నీవీ బంధంబు వదల వసనంబు జాఱ రణర్ఘంటి కాకలితరశనాదామంబు నాకర్శించుచు వాయసంబుమీఁదం బొడమినకోపంబు దిగ్గున లేచి వాయసోత్సారణార్థం బొక్కింత దూరంబరిగి మ కలి వచ్చి నీచేత నసహసితనై సిగ్గునం దలవాంచి క్రమ్మఱ సుఖాసీనుండవై ననీ యుత్సంగంబున నాసీన నై వాయసోత్సారణంబునం దసమర్థనై దుఃఖించుచు నప్పు డేను సంప్రహృష్టచిత్తుండ వైననీ చేతఁ బరిసాంత్వతనగుచు బాష్పపూర్ణ ముఖనై కన్నీరు మార్జించుచుఁ బరిశ్రమంబువలనఁ గోండొక సేపు భవదంక తలంబున నిద్రించి మేల్కొనినపిస్తుటఁ గ్రమంబున నీవు మదంకంబున నిద్రించి యుండ వెండియు నక్కాకంబు సుస ప్రబుద్ధ నైన నన్ను డాసీ సారెసా రేకు మదీయ స్తనాంతరంబునంజీఱినఁ దద ణసంజాతరక్తబిందు సందోహసముక్షిత శరీరుండవై లేచి కాకతుండాఘాత వ్రణీకృత స్తనాంతరనైనన న్నవలోకించి సం శ్రుద్ధం బైన మహాపన్న గంబుకరణి నూర్పులు నిగిడించుచు. D 905 క. వనజాతినేత్ర యెవ్వఁడు, మునుకొని ని న్నిట్లు చేసె మూఢతఁ బంచా నన భుజగముతో నెవ్వాఁ డను, పుగఁ గ్రీడింపఁ దలఁచె నని రోసమునన్. 906 క. నలుదెసలు చూచి నాముం, గల శోణితసి క్తపటునఖంబై మిగులం దలఁశక నా కభిముఖముగఁ, జలమున వర్తించు వాయసముఁ గని యలుకన్. చ. మనమున దాని నింద్రునికుమారునిఁ గా సతిసత్త్వశాలిఁ గా ననలసమాన వేగునిఁ గనద్రి గుహాంతరవాసిం గా నెఱిం
పుట:గోపీనాథరామాయణము2.pdf/303
స్వరూపం