Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/301

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గోపీనాథ రామాయణము క. దానవుల కభిముఖుఁడవై, పూనిక నీ వతిభరమునఁ బోరుచు నుండ మానక యేసు భయంబున, వానరకులవర్య జాతి వనధిం బడనే. క. పడినంత దానవులు ననుఁ, గడువడిఁ గొని లంకకేగి క్రౌర్యంబునఁ దెం పడరఁగ భక్షింపుదురో, గెడపుదురో యొండుచోటికిం బాపుదురో, క. పావనీ జయాపజయములు, దైవాధీనములు గానఁ దడయక నిన్నా దేవ ద్వేషులు గెలి చెదరో వారల నీవె గెలిచెదో తెలియ దొగిన్. క. న న్నొండువిధము చేసిన, నిన్నాజిం బట్టుకొనిన నేఁ డంత సభ 889 890 891 892 స్వన్నందన మనకార్యము లన్నియును నిరర్థకంబు లై చెడిపోవున్. న, కపీంద్రా మహాసత్త్వుండవు పరాక్రమవంతులలోన నతివి శ్రుతుండవు వాయు సమాన వేగుండవు బలపరాక్రమవిశేషంబున రాణీసులన శ్రమంబున జయించి స న్నపాయంబు నొందకుండ సతి ప్రయత్నంబున రక్షించుకొని పోయెద నంటి వేని వానరసై వ్యంబులం గూర్చి యవక్రపరాక్రమంబున రావణుని బాంధవ సహితంబుగా రణంబున వధించి పౌరుషంబున నన్నుం గొనిపోవ నుప క్ర మించిన నుపక్రమించిన రఘువర్యుని ప్రయత్నం బంతయు వైఫల్యంబు నొందు నట్లుగా కుండ రాక్షసుల వంచించి శీఘ్రంబునం గోనిపోయెద వంటి వేని మున్ను జనస్థానంబున రాముని వంచించి రావణుండు కపట పరివ్రాజక రూపంబున ముచ్చిలించి సీతందెచ్చె నద్దు రాత్ముని సంగ్రామంబున వధింపం జాలక రాముండు తత్ప్రకారంబునం గ్రమ్మఱ జానకిం గొనిపోయె నెంత పరాక్రమహీనుం డని శూరులు నిందింతురు దానం జేసి మానధనుం డగురాముని పౌరుషంబునకు హాని సిద్ధించుం గావున నెల్ల భంగుల నన్నుం గొనిపోవుట నీకుఁ గరంబుగాదు రాముండుభ వత్సహితంబుగా యుద్ధార్థియై చనుదెంచిన నది మిక్కిలి గుణం బగు నదియునుం గాక శ్రాంతుండ వై యుండ నప్పుడు రాక్షసులు నన్నుఁ గొని చని రామలక్ష్మణులు వానరు లెఱుంగ కుండునట్టి రహస్య ప్రదేశంబున నన్ను దాఁచెదరు దానం జేసి భవదారంభం బంతయు వ్యర్థం బగు రాముని జీవితంబును లక్ష్మణ భరతశత్రు హ్నులజీవితంబులును భవజీవితంబులునుసు స్త్రీ వకుల జీవితంబునుమజీవి తాధీనంబై యుండుఁ గావున నారామలక్ష్మణులు నాయందునిరాశులై శోక సంతాపకర్శితు బై సర్వవానర భల్లూకసహితంబుగాఁ బ్రాణంబులు విడువం గలవారదీయునుం గాక. 893 చ. అనఘచరిత్రుఁ జారఘుకులా గ్రణి రాముఁ డొకండు దక్క నా తనువును ధాత్రి వేఱకుఁడు దాఁకఁగ నర్హుఁడు గాడు నీచన నుఁ డగునీ నిశాచరుఁడు తస్కరుఁ డై ననుఁ దాఁకినందుకే మనమునఁ జలఁ జింతిలుచు మాటికి వానివధంబుఁ గోరుదున్. మానవేంద్రుడు నాయొద్ద లేనివేళఁ, గడిమీ దుష్టానుగుండు మద్దాశ్ర మంటి ముచ్చిలించి ననుం గొనితెచ్చె నపుడు, సేయునవి లేక వివశతఁ జెందియుంటి. 894