Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/296

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


రౌద్రాస్త్రదగ్ధుఁడై రణమునఁ బడినర, క్షఃపతి నీక్షింపఁ గలుగు నయ్య


తే.

నలినగంధియుఁ గనకవర్ణంబు నైన, పతిముఖము నన్నుఁ బాసినకతన ఘర్మ
కాలతీవ్రాతపమ్లానకమలముక్రియ, నుదితదుఃఖముచేఁ గందకున్న దయ్య.

851


సీ.

ధర్మ ముద్దేశించి ధరణి రాజ్యత్యాగమున నెవ్వనికి వ్యధ పుట్టదయ్యె
నసురమృగాకీర్ణ మగుకాన వర్తింప నీల నెవ్వనికి భీతి గలుగదయ్యె
మానక యడవిలో మత్పాదసంచారమున నెవ్వరికి వగ పొడమదయ్యె
నట్టిసాహస యైనయధిపతి యాత్మలోఁ బన్నుగ ధృతిఁ బూని యున్నవాఁడె


తే.

అకట నాకంటెఁ బతికి స్నేహంబువలనఁ దల్లిదండ్రులు చుట్టలు తగ నధికులు
సములు గారు గావునఁ దదాగమనవార్త, నొగి వినినదాఁక జీవించి యున్నదాన.

852


ఉ.

ఎప్పుడు వచ్చు రామవిభుఁ డెప్పుడు తద్దశకంఠుఁ ద్రుంచు న
న్నెప్పుడు కోర్కి దీరఁ బురి కెప్పుడు దోడ్కొని వేడ్కఁ బోవు న
న్నెప్పుడు గారవించుఁ దుది యెప్పుడు మద్వ్యసనాంబురాశికిన్
జెప్పఁ గదయ్య కీశకులశేఖర యుల్లము తల్లడిల్లెడిన్.

853


వ.

అని యి ట్లమ్మహీనందని మధురంబును మధురార్థయుక్తంబు నగువాక్యంబు పలికి
క్రమ్మఱ నమ్మారుతపుత్రుఁ డిచ్చురామార్థయుక్తంబును మనోభిరామంబు నగు
సదుత్తరంబు వినుకోర్కింజేసి యూరకున్న నద్దేవిపలుకులు విని యవ్వానరశ్రే
ష్ఠుండు శిరంబున నంజలి గీలించి వినయంబున ని ట్లనియె.

854

హనుమంతుఁడు సీతకు రాముని యప్పటిస్థితిని తెల్పుట

ఉ.

ఒచ్చెము గల్గి రామవిభుఁ డొండు దలంచినవాఁడు గాఁడు నీ
విచ్చట నున్కిఁ దా నెఱుఁగ కొన్నిదినంబులు జా గొనర్చె నే
నచ్చుగ నేగి నీదువిధ మంతయుఁ జెప్పినఁ దత్క్షణంబ దా
వచ్చు ననేకవీరపరివారితవానరసైన్యయుక్తుఁ డై.

855


క.

వచ్చి నిశాతశరంబులఁ జెచ్చెర నంభోధి నింకఁ జేసి రణములో
మచ్చరమున దశకంఠుని, వ్రచ్చి వధించి నిను నిక్కువము గొనిపోవున్.

856


క.

నినుఁ గొని చనుటకు రాముఁడు, చనుదెంచెడునపుడు సురనిశాచరు లైనన్
ఘనమృత్యు లైన నష్టము, చనుదెంచినఁ దునిమి వైచు శాతశరములన్.

857


చ.

తరుణి భవద్వియోగపరితాపపరిప్లుతుఁ డై రఘూద్వహుం
డరయ వనంబులో మృగవరార్థిత మైన మహాద్విపంబువై
ఖరిఁ దగ శర్మ మెంతయును గానక గాసిలుచుండు నిత్య మే
నరిగి భవద్విధంబు దెలియ న్వినిపించెద నంత వచ్చెడున్.

858


ఉ.

ఇమ్ముగ దేవదంతిపయి నింద్రుఁడుఁ బోలె మహీధరాగ్రదే
శమ్మునఁ గూరుచున్నరఘుసత్తము పంకజపత్రనేత్రయు
క్తమ్మును జారుకుండలయుతంబును బింబఫలారుణాధరో