Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


జాతరూపభూషణములు పీతచేత
ములు ధరించినపురుషులుఁబోలెఁ గంటె.

19


చ.

అసమసతీవియోగజనితార్తిఁ దపించెడునాకు శోకదీ
పనకర మౌ వసంత మిది బంధురతన్ శుకశారికార్భటు
ల్తనరెడు మన్మథుండు నిశితప్రదరంబుల నేఁచుచున్నవాఁ
డనుపమభంగిఁ బైకము కలార్భటి న న్బిలువం దొడంగెడిన్.

20


తే.

అంగజాస్త్రాభివిష్ణుండ నైననాకు, రమ్యకానననిర్ఝరరాజియందుఁ
దాప మధికంబు సేయంచు నేపు మీఱి, కూయుచున్నవి యీవారికుక్కుటములు.

21


క.

పన్నుగ నాశ్రమపదమున, మున్నీకుక్కుటరవంబు భూసుత విని తా
నన్నుఁ బిలిచి సంతోషా, భ్యున్నతమై కూడి యాడుచుండుం గాదే.

22


వ.

మఱియు నిచ్చటిఖగంబులు విచిత్రపత్రంబు లై భృంగరాజప్రముదితంబులై
నానావిధమధురస్వరయుక్తంబులై యాత్మీయవ్యూహాభినందితంబులై పురుష
విహంగంబులం గూడి వృక్షగుల్మలతాప్రతానంబులమీఁద వ్రాలుచున్నవి
విలోకింపు పుష్కరిణీతీరంబుసం గలవృక్షంబులు నత్యూహకృతశబ్దంబుల
చేతఁ బుంస్కోకిలరుతంబులచేత ననంగప్రదీపనంబు లై ధ్వని సేయుచున్నవాని
పోలికఁ జూపట్టుచున్న వదియునుంగాక.

23


క.

ఏలాలతావృతములై, కూలంబునఁ జూతతరులు కోకిలశుకవా
చాలత వియోగి నగు న, న్నోలగమున నవ్వి తెగడుచున్నవి కంటే.

24


క.

తరుపల్లవహేతియు వళి, గురురవనిస్వనుఁ డశోకకుసుమాంగార
స్ఫురణుఁ డగువసంతానలుఁ, డురుగతి న న్నేర్చఁదొణఁగె నుజ్జ్వలుఁ డగుచున్.

25


క.

మృదుభాషిణిని సుకేశిని, సదమలగుణవతిని పరమసాధ్వి నళికచ
న్ముదిత నెడఁబాసి ధర మా, నద బ్రతుకుట నిష్ప్రయోజనం బగుఁ గాదే.

26


క.

సముదంచితరుచిరార, ణ్యము నభినవరమ్యకోకిలాకులసీమాం
తము నగునీఘనసుమసమ, యము మత్ప్రియ కరయఁ గడుఁ బ్రియంబై యుండున్.

27


క.

మారాయాసప్రభవము, వారక వరసురభిగుణవివర్ధిత మగునీ
దారుణశోకాగ్ని నను, న్గాఱియపెట్టంగఁదొణఁగె ఘనగుణశాలీ.

28


తే.

సీత నెడఁబాసి యీమహీజాతములను, బన్నుగా విలోకించుచు నున్నకతన
ననఘచారిత్ర మన్మథుఁ డంత కంత, కధికుఁడై యేర్చుచున్నవాఁ డనఘచరిత.

29


తే.

మనుకులోత్తమ పరిదృశ్యమానుఁ డైన, స్వేదసంసర్గశామకాంచితవసంతుఁ
డరయఁగ నదృశ్యమానమైనట్టిసీత, యును మనోవ్యధఁ గావించుచున్నవారు.

30


తే.

రాజసుత గ్రూరుఁడైన చైత్రవనపవనుఁ, డవనివిరహులకంతకుం డగుమధుండు
న న్నిపుడు కడు నేర్చుచు నున్నవారు, జానకీశోకసంతవ్యమానచిత్తు.

31


క.

స్పటికగవాక్షప్రతిమ, స్ఫుటపింఛము లనిలవేగమున విచ్చి శిఖు