226 గోపీనాథ రామాయణము క్షీణకాంతి యోదంబునం జిక్కి నగజాంగనభంగి దైన్యంబు నొంది పంజర మధ్యగత యైన శారిక విధంబున రాక్షసీమధ్యంబునం జిక్కి ధూమజాలావృత పావకశిఖలా గునఁదనుచ్ఛాయనడంగిపొంసుపరిచ్ఛన్న యైన హేమళలాకకై వడి నొప్పుమాలి ప్రభంజనరయోద్ధూతమై మోటువడి యున్న కదంబ శాఖ లాగున మండనంబులు డుల్చి జంటఁ బాసిన జక్కవ పెంటిక్రియఁ బొలుపుదక్కి ప్రయో దాంతంబునందు శారదాభ్రపరివృత యైనచంద్ర రేఖగతి మలినాంగచ్ఛాయ "ఁదూలుచుఁ బాండురపరాగ పటల పరిచ్ఛన్న యైనపుష్పమంజరి సొంపున ధూళి బ్రుంగి పంక నిమగ్న మైసగోవుసొబగునఁ జేష్టులు మాని మంత్రేషధరుద్ధ వీర్య యైనభుజంగీకరణి నూర్పులు పుచ్చుచు ననారోపితతంత్రి యైనవల్ల కియట్లు రామణీయకంబువిడి చియుద్వర్తనాదిసంస్కా రాభావంబువలన నతిక్లిష్ట రూపయై భర్తృదర్శనహీనయై చారి త్రవ్యప దేశాఢ్యయై భర్తృవాత్సల్య భూషితయై భర్తృహితయు క్తయై తనదురవస్థకుం గుందుచుఁ గ్రూర రాక్షసులతర్దనో క్తులకు దలంకుచు రావణుదౌరాత్మ్యంబునకు నిందించుచు రామునిం బేర్కొని కాప రావేయని చీరుచు దైవంబును దూఱుచు ధరాస క్తవీక్షయై కన్నీరు నించుచు నిశ్శ్వాసమారుతంబులఁబల్లవధారివృక్షంబులదహించుచు స్వభావతనుచ్ఛాయ నవ్వనంబు నెల్ల వెలింగించుచు నేక వేణియు మలినాంగియు మల సంకుల శిరోజు యునై శోకరసాధి దేవతయంబో లెఁ జూపట్టుచు బహు ప్ర కారంబులదుఃఖించు చున్న సీత నవలోకించి తదీయదివ్య మహిమంబులు వక్కాణించుచు హర్ష బాష్ప. పరిప్లుతుండై మనంబున న దేవికి రామలక్ష్మణులకు నమస్కరించి యమ్మహీపుత్రి తోడ రామునిసం దేశంబుఁ జెప్పుటకు నవసరం బరయుచుండ రాత్రి యామ త్రయంబయ్యె నప్పుడు షడంగనహితం బయిన బ్రహ్మరాక్షసులు వేదఘో షంబు మధురంబుగా వినవచ్చె నంత నక్కాలంబున శ్రోత్రమనోహరంబులగు మంగళ వాది త్ర గీతశబ్దంబుల మహాబలుం డగు రావణుండు మేల్కని. త అచంచండి. రావణుఁడు సీతయున్న స్థలమునకు వచ్చుట. తరం- త చ. అవనిసుతం దలంచుకొని యాత్మ వివర్ధిత మైన కామము న్దవిలి సహింప లేక మదన ప్రహరాహతి కోహటించి త త్ప్రవిమలమానసంబు బహుభంగుల మంజువచోని రూఢి నా త వశము చేసి కొందు నని తద్దయు వేడుక దుర్విచారుఁడై · చ. సదమల చం ద్రి కాధవళ చారుదుకూలముఁ గట్టి మోదము నదురఁగ రక్త చందనము కస్తురియుం గలపంబు మెత్తి సొం పొదవఁ బ్రసూసదామచయ మొప్పుగఁ జుట్టి విచిత్ర కాంచనాం గదమకుటాదిభూషణనికాయములం గయినేసి గ్రక్కునన్. 431 492 488
పుట:గోపీనాథరామాయణము2.pdf/249
స్వరూపం