| |
భూరుహశాఖాగ్రములమీఁద నివసించు పక్షిసంఘములు విభ్రాంతి నొంద
గమనీయసైకతాగ్రములపై విహరించు కిన్నరమిథునముల్ కృశతఁ గుందఁ
|
|
| తే. |
జటులమరకతమణిరుచిశాద్వలములఁ
బ్రీతిమెయి నాడు హరిణముల్ బెదరిపఱవఁ
గఠినహరివీరఘనపదాఘాతమునకు
భీతిఁ గొని గోత్రవరము కంపించె నపుడు.
| 1406
|
| వ. |
మఱియు నమ్మహాశిలోచ్చయం బర్ధవినిస్సృతంబు లైనభుజంగంబులచేత నుద్దీపిత
కేతనంబులచేతం బోలె నభిరామం బై యొప్పి మఱియుఁ ద్రాససంభ్రాంతు
లైనమహర్షులచేతఁ బరిత్యజ్యమానం బై యన్నగోత్తమంబు సార్థహీనుం డైన
పథికునికైవడిఁ జూడ నొప్పె నప్పుడు మహావేగుండును బరవీరహంతయు నగు
హనుమంతుండు వేగంబునందు సమ్యక్సమర్పితచిత్తుం డై లంకాపురంబునకుం
జనుటకు మనస్సమాధానంబు గావించె నని యిట్లు కిష్కింధాకాండకథా
ప్రపంచం బంతయు సమగ్రంబుగా వినుపించిన విని సంప్రహృష్టచిత్తుం డై రామ
భద్రుండు భద్రవాక్యంబుల వారలం బ్రశంసించి యటమీఁది కథావృత్తాం
తంబు వినిపింపుఁ డని యడుగుటయు.
| 1407
|
కందగీతద్రుతవిలంబితస్వాగతాగర్భచంపకము
| |
కరివరకామదా దనుజఘస్మర ధన్యకథా జితారిమా
వరవిభ వామనా వినుతవాసవ విశ్వప విక్రమాఢ్య భూ
ధర హరి ధామదాకనకదాస్థిరకార్య జగన్నుతాఖ్యశ్రీ
కర జనకాముకాప్రణుతకార్ముకబాణ విపన్నపాలకా.
| 1408
|
ఖడ్గబంధము
| |
రాజరాజ రాజసేవ్యరాజపూజకా జరారాజితామలోరుకీర్తిరమ్యసద్గుణాకరా
రాజవంశవర్య దైత్యరాజవైరి యిందిరా
రాజసన్నిభాననాభిరాజితాబ్దభాస్కరా.
| 1409
|
చతుర్విధ కందము
| |
సురవర సర్వశరణ్యా, సరమా మురహర సరసిజచరణా కరిపా
హరసఖ శశిరవినయనా, సరసా యదువర ధరధరసరసాత్మ హరీ.
| 1410
|
| గద్యము. |
ఇది శ్రీరామచంద్రచరణారవిందమకరందరసాస్వాదనతుందిలేందిందిరా
యమాణమానసకులపవిత్ర కౌండిన్యసగోత్ర పద్మనాభసూరిపుత్ర విద్యాసాంద్ర
వేంకటకవీంద్రప్రణీతం బైనశ్రీమద్రామాయణం బనుమహాకావ్యంబునందు రా
మవిరహశోకంబును హనుమత్సమాగమంబును ఋశ్యమూకగమనంబును సు
గ్రీవసఖ్యంబును సీతాభరణప్రదానంబును వాలిసుగ్రీవులవైరానుకథనంబును
|
|