| |
బేరీతిఁ జొచ్చితిరి మీ, ధీరత్వము పొగడఁ జెల్లదే నా కిచటన్.
| 1153
|
| క. |
వలసిన ఫలమూలాదులు, నలువుగఁ జిత్తములు దనియ నమలుఁడు మధురా
మలజలముం గ్రోలుఁడు సే, దలు వాయఁగ ననుడుఁ బ్రీతిఁ దరుచరవీరుల్.
| 1154
|
| క. |
మెప్పుగ మూలఫలంబులు, తప్పక భక్షించి ఘనసుధాసమసలిలం
బప్పు డటు గ్రోలి యాఁకలి, దప్పియుఁ దీర్చికొని వెస గతశ్రము లగుచున్.
| 1155
|
| వ. |
అలరుచున్నవారలం గనుంగొని యత్తపస్విని వెండియు.
| 1156
|
| క. |
అనుకంప గదుర నిట్లను, ఘనముగ నీబిలము నెట్లు గంటిరి మీ రే
యనువునఁ జొచ్చితి రెక్కడి, వనచరు లేమిటికి నిటకు వచ్చినవారల్.
| 1157
|
హనుమంతుఁడు స్వయంప్రభకుఁ దాము ఋక్షబిలముఁ బ్రవేశించినవిధంబు దెల్పుట
| క. |
మీతెఱఁ గంతయు నేర్పడ, నాతో వివరింపుఁ డనిన నగచరవరుఁ డా
వాతాత్మజుండు దానికిఁ, జేతోముద మలర నిట్లు చెప్పఁ దొడంగెన్.
| 1158
|
| సీ. |
వసుధేశుఁ డిక్ష్వాకువంశజుండు సుపర్వరాజతుల్యుఁడు దశరథతనూజుఁ
డనఘాత్మకుఁడు రాముఁ డనుజుఁడు భార్యయుఁ గొలువఁ గాంతారసీమలకు వచ్చి
నెఱిఁ బంచవటమున నివసించి యుండ నన్నరపతిసతిని జానకిని బంక్తి
వదనుండు బలిమిచే వంచించి కొనిపోయె రామునిసఖుఁడు మర్కటవిభుండు
|
|
| తే. |
ఘనుఁడు సుగ్రీవుఁ డమ్మహీతనయ వెదకి, రమ్మనుచు దక్షిణాశకు మమ్ముఁ బనుప
నంగదాదులఁ గూడి రయంబు మెఱయ, మానినీమణి వెదకంగఁ బూనివచ్చి.
| 1159
|
| చ. |
సొలయక యెల్లదేశములఁ జూచుచు వచ్చి యగస్త్యుదిక్కునం
గలతటినీసరఃపుళినకాననపర్వతకందరంబులం
గలయఁగఁ జూచి యందు నృపకన్యను గానఁగ లేక క్షుత్పిపా
సలఁ గడు డస్సి యందఱము క్ష్మారుహమూలముఁ జేరి దీనతన్.
| 1160
|
| ఉ. |
నాలుక లెండ దండి వదనంబుల వెల్లఁదనంబు దోఁపఁగాఁ
జాలఁ దపించుచు న్ధృతియు జాఱ నపారవిపత్పయోనిధిం
దేలుచు దిక్కు లారయుచు నీ రెచటం గలదో యటంచు నే
లీలఁ జరింత మెట్లు నృపులేమను గాంచెద మంచు నున్నెడన్.
| 1161
|
| వ. |
లతాపాదపసంఛన్నంబై సాంద్రతిమిరసంవృతంబై యొక్కమహాబిలంబు మ్రో
లం జూపట్టెఁ బదంపడి సలిలక్లిన్న పక్షంబులతోఁ గమలరజస్సిక్తరక్తాంగంబులతో
హంసచక్రక్రౌంచసారసకారండవాదిజలపతత్రిప్రకరంబు లాబిలంబు వెల్వడి
మింటి కెగసినఁ దత్ప్రకారంబు గని యబ్బిలంబులోన నొక్కజలాశయం
బుండు నని యూహించి సలిలార్థులమై యున్నవార మగుటను శీఘ్రంబున నేమం
దఱ మచ్చటికిం జని యతిసాహసంబున నబ్బిలంబుఁ జొచ్చి యొండొరులం గౌఁగి
లించుకొని యతిప్రయత్నంబున వచ్చి యిచ్చోట నిన్ను సందర్శించి భవత్ప్ర
సాదంబునఁ బ్రాప్తించినయీరుచిరఫలమూలంబు లుపయోగించి యమృత
|
|