| చ. |
నిరుపమపుణ్య వెవ్వతెవు నీ విట నొంటి చరించెదోటలే
కరియఁగ నీమహాబిల మనర్ఘమణీతపనీయరాసు లీ
సురుచిరదివ్యరత్నపరిశోభితమందిరపంక్తు లేమహా
పురుషుని వాత్మ కచ్చెరువుఁ బుట్టఁగఁ జేయుచు నున్న వెంతయున్.
| 1147
|
| ఉ. |
ఆఁకట దప్పిచే బడలి యందఱ మీతిమిరాప్రకాశితా
స్తోకబిలంబు సొచ్చి యొకచొప్పున వచ్చి సమగ్రకాంచనా
నోకహపంక్తు లద్భుతమనోజ్ఞసువర్ణవిశాలసౌధప
ద్మాకరముల్ గనుంగొని భయవ్యధితాత్ముల మైతి మెంతయున్.
| 1148
|
| సీ. |
ఏమహాపురుషుని దీదివ్యపట్టణం బీమూలఫలజాత మీవిశాల
హైమకవాటగవాక్షుకుడ్యస్తంభమహనీయసుందరమందిరములు
నీవృక్షషండంబు లేమహాత్మునితపోమహిమచేఁ గాంచనమయము లయ్యె
నీసరోవరపంక్తు లెవ్వానితపమునఁ గాంచనమయదివ్యకమలకుముద
|
|
| తే. |
మత్స్యకచ్ఛపకర్కటమకరచక్ర, నారసక్రౌంచవిమలహంసములఁ బడసె
నీసురభిపుష్పసంచయ మెట్లు గలిగె, మఱియు నీభర్మరాసు లేకరణి నొప్పె.
| 1149
|
స్వయంప్రభ హనుమదాదులకు ఋక్షబిలోత్పత్తిప్రకారం బెఱింగించుట
| క. |
ఈవిమలదివ్యగంధం, బేవిధమునఁ గలిగెఁ దాపసీ మఱి యేలా
గీవిధము తేటపడఁ జెపు, మా వినియెద మనిన నతని కది యి ట్లనియెన్.
| 1150
|
| చ. |
చతురుఁడు శిల్పనైపుణవిశారదుఁ డద్భుతతేజుఁ డార్యస
మ్మతుఁడు మయుం డనాఁ బరఁగు భవ్యుఁడు దానవవిశ్వకర్మ యీ
వితతబిలంబునందుఁ గడువేడ్క సమస్తపదార్థముల్ గరం
బతులితరత్నకాంచనమయంబులుగా నొనరించె నెంతయున్.
| 1151
|
| వ. |
మఱియు నమ్మయుండు తొల్లి దివ్యవర్షసహస్రంబులు విరించి గుఱించి తపంబు
గావించి యద్దేవుని ప్రసాదంబువలన విచిత్రనిర్మాణప్రతిపాదకశిల్పశాస్త్రజ్ఞానంబు
వడసి మాయావి యై విచిత్రశక్తిచేత నీదివ్యజాతరూపమయభవనరాజంబు
నీమహనీయకాంచనవనంబు నీమనోజ్ఞసువర్ణకమలాకరంబులు నిర్మించి యౌశన
సం బైనధనం బంతయుఁ బడసి యిమ్మహావనంబున హేమ యనునప్సరసం గూడి
కొంతకాలంబు లీలావినోదంబులం దగిలి కామోపభోగంబు లనుభవించుచుండ
దానికి సహింపక పురందకుండు మయుని వజ్రధారావినిపాతితుం జేసె నంతఁ
బరమేష్ఠి యీకాంచనవనంబు నీదివ్యభవనంబును శాశ్వతంబు లగుకామభోగం
బులును హేమ కొసంగె నే నాహేమకు వయస్య నగుటం జేసి తత్ప్రసాదంబు
వడసి యీపురంబు గాచికొని యున్నదాన నేను మేరుసావర్ణికూఁతుర స్వయం
ప్రభ యనుదాన నని పలికి వెండియు నత్తాపసి యి ట్లనియె.
| 1152
|
| క. |
మీ రెవ్వ రిటకు నేగతిఁ జేరఁగ వచ్చితిరి యప్రసిద్ధ మగుబిలం
|
|