Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/159

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


⁠

జేసి యందలిగుహాగహనసరిత్సరోవరవిమలద్రుమశిఖరదుర్గకటకనితం బాధిత్య
కోపత్యకలయందుఁ దిలకించుచు.

⁠ 1108


క.⁠

జనకజను వెదకి కానక, ఘనఫలమూలములు మెసవి కడువేగమునం
జని యచట నొండుదేశముఁ, గనుఁగొని రఘువిభునిసతిని గలయ వెదకుచున్.

⁠ 1109


వ.⁠

ఆదేశంబు దురన్వేషం బై గుహాగహనవంతం బై నిర్జనం బై జలరహితం బై గగ
నంబుపగిది శూన్యం బై రోమహర్షణం బై యుండుట కచ్చెరు వొందుచు నా
దేశం బతిక్రమించి తాదృశంబు లగువనదుర్గంబు లనేకంబులు విలోకించుచుఁ జని
చని యవ్వలఁ బుష్పఫలవర్ణరహితవృక్షంబులును నిస్తోయంబు లగుసరిత్సరోవ
రతటాకంబులును భ్రమరపరివర్జితప్రేక్షణీయసుగంధిస్థలపద్మంబులును గుసుమహీ
నలతావితానంబులును సంఫుల్లకమలోత్పలకైరవవిహీనంబు లైనప్రసన్నసలిలా
శయంబులును విహంగమశూన్యంబు లైననీడంబులును మృగపరిత్యక్తకుంజపుం
జంబులును గలిగి దురాధర్షంబై దుష్ప్రవేశం బై సర్వౌషధీరహితం బైయున్న
వేఱొక్కదేశంబు విలోకించి రది తొల్లి మహాభాగుండును సత్యవాదియుఁ దపో
ధనుండును నియమంబులచేత దుష్ప్రధర్షణుండును బరమామర్షియు నగుకండు
వనుమహర్షి పోడశవార్షికబాలకుం డైన తనపుత్రుం డవ్వనంబునం బ్రణష్టుఁ డైనఁ
గోపించి యీవనంబు సర్వసత్వవివర్జితం బై యరణ్యం బై దురాధర్షం బై యుం
డుఁ గాక యని శపించినకారణంబున నట్టిదయ్యె నవ్విపినంబు ప్రవేశించి యచ్చటి
పర్వతారణ్యనదీనదంబులు విలోకించి యెందును జానకిం గానక వెండియు
సర్వస్థలంబులు శోధించి.

⁠ 1110


ఉ.⁠

రావణు రామభూవిభుని రామను గానక వేగ యమ్మహా
దావము దాఁటి యొండు వసుధాధర ముద్ధతిఁ గాంచి యంద గు
ల్మావృత యైనదారుణగుహం గని యాగుహలోన భీషణ
గ్రావముభంగిఁ గ్రాలుఘనకాయుని దైత్యునిఁ గాంచి రొక్కనిన్.

⁠ 1111


క.⁠

కని వాని డాయఁబోయిన, ఘనతరకోపమున వాఁడు కన్నుల నిప్పు
ల్చినుకఁగ వానరవీరులఁ, దునిమెడుతమి ముష్టిఁ బూన్చి దో తెంచుటయున్.

⁠ 1112


ఉ.⁠

వచ్చెడు రాక్షసాధముని వారక కన్గొని వాలినందనుం
డచ్చుపడంగఁ బంక్తిముఖుఁ డంచుఁ దలంచి మహాగ్రహంబునం
జెచ్చెర హస్తతాడితునిఁ జేసిన నెత్తురు వాతఁ గ్రక్కుచుం
జచ్చి ధరత్రిపైఁ బడె నిశాచరుఁ డొక్కనగంబుచాడ్పునన్.

⁠ 1113


వ.⁠

ఇ త్తెఱంగున మారీచతనయుం బరిమార్చి జితకాశు లగునంగదాదులు హను
మత్పురోగములై తద్గుహాభ్యంతరంబు సర్వంబునుం గలయ శోధించి యందు
జానకిం గానక దాని నిర్గమించి క్రమ్మఱ భయావహం బైనవేఱొక్కగిరిగహ్వ
రంబుఁ జొచ్చి యచ్చట బహుప్రకారంబుల వెదకి సీతం గానక వెడలి వెండియు
వనం బంతయుఁ బరిశోధించి యందునుం గానక.

⁠ 1114