Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/148

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


గేతకీషండంబుల నారికేళవనంబులం దిలకించి మఱియుఁ బశ్చిమవాహిను లగు
శీతసలిలపూర్ణనదీనదంబులఁ దాపసారణ్యంబులఁ గాంతారదుర్గంబుల గిరిసాను
కందరంబుల జానకి నన్వేషించి దుర్గంబు లగుపర్వతంబుల శోధించి యచ్చట
మరుప్రాయంబు లగుస్థలంబు లన్నియు వీక్షించి యవ్వలఁ దిమినక్రఝుషాకులం
బైనపశ్చిమసముద్రంబుఁ జేరి యచ్చటఁ గేతకీషండంబులఁ దమాలగహనంబుల
నారికేళవిపినంబుల మఱియు వేలాతటనివిష్టంబు లగు పర్వతకాననంబుల వైదే
హి నన్వేషించి పశ్చిమసముద్రమధ్యంబున మురచీపట్టణంబును జటీపురంబు న
వంతియు నంగలోపయు మొదలుగాఁగల విశాలంబు లగుపట్టణంబులును రాష్ట్రం
బులు నలక్షితం బనువనంబును సింధుసాగరసంగమంబును నిరీక్షింపుఁ డాసింధు
సాగరసంగమప్రదేశంబున నూఱుశిరంబులు గలిగి మహోన్నతతరువ్రాతంబుల
కాకరం బై మహోన్నతం బైనహేమగిరి యనునొక్కపర్వతం బొప్పు రమ్యంబు
లైనతత్పర్వతప్రస్థంబులందు సపక్షంబు లగుసింహంబులు తిమిమత్స్యగజంబుల
స్వనివాసస్థానభూతవృక్షాగ్రకులాయంబులకుం దోడ్కొని చని కలసి మెలసి
విహరించుచుండు విశాలం బగుతోయపూర్ణస్థలంబునం దున్నగజంబులు గిరి
శృంగగతంబు లగుగజంబులును సింహనీడాశ్రయసానువులయందు విహరించు
చుండు నప్పర్వతశృంగంబు గగనంబుతో రాయుచుఁ జిత్రపాదపం బై కాంచన
మయం బై యొప్పు నందుఁ గామరూపు లై సీత నన్వేషింపుఁ డవ్వల సముద్ర
మధ్యంబున శతయోజనప్రమాణంబు గలిగి సువర్ణచ్ఛాయలం దేజరిల్లుచు
నెవ్వరికిం జొరరాక పారియాత్రపర్వతకోటి విలసిల్లు నందు బలవంతులును
ఘోరాకారులును గామరూపులును వహ్నిసంకాశులు నగుచతుర్వింశత్కోటి
గంధర్వులు తదీయదివ్యామృతకల్పస్వాదుమూలఫలంబులం గాచికొని యుండు
దురు వా రందఱు దురావారులును దుష్ప్రసహులును దురానదులు నై యుందు
రవ్వనంబులో నుండి యొక్కఫలం బైనఁ దెచ్చుటకు మీకు శక్యంబు గాదు
వారిచెంతఁ జేరక నచ్చోట సీత నతిప్రయత్నమున నన్వేషింపుఁడు వారివలని
భయంబు మిమ్మఁ జెందకుండు మఱియు నాపశ్చిమసముద్రమధ్యంబున వైడూర్య
వర్ణసంకాశం బై వజ్రసంస్థానసంస్థితం బై నానాద్రుమలతాకీర్ణం బై శ్రీమంతం
బై శతయోజనప్రమాణం బై వజ్రం బనుపర్వతం బొక్కటి చంద్రమండల
సంకాశం బై యొప్పుఁ దద్గుహాగహనదేశంబుల నప్రమత్తులై యతిప్రయత్నం
బున జానకి నన్వేషింపుఁ డటమీఁద.

1031


క.

హరిచందనకల్పతరూ, త్కరశోభితరత్నసానుకటకశిఖర మై
శరనిధి నాలనపాలై, వఱలు నొకనగంబు చక్రవంతం బనఁగన్.

1032


క.

అట ఘోరవహ్నికీలా, చటుల మగుసహ్రకోటిచక్రము రక్షో
భటనాశనార్థము సము, త్కటముగ మును విశ్వకర్మ గావించె రహిన్.

1033


క.

దానిఁ గొని పంచజనుఁ డను, దానవు హయముఖునిఁ జంపి తత్కుక్షిగతం