Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


యటమీఁద నంధ్రపుండ్రచోళపాండ్యకేరళదేశంబులు వెదకుచు నయోము
ఖం బైనసహ్యశైలంబు నెమకుఁడ యవ్వల.

1016


చ.

సుమితవిచిత్రకాననము సుందరకందరసానుశృంగయు
క్తము ఘనధాతుమండితము కమ్రప్రయోజనము ల్లసత్సరః
కమలవిహారిమత్తకరికాండము నై మలయాభిధానశై
లము తనరారు నచ్చట నిలాతనయం దిలకింపుఁ డింపుగన్.

1017


ఉ.

అమ్మహనీయశైలశిఖరాగ్రమునందు మనోజ్ఞగంధభృ
తోమకులచందనాటవులఁ దోయరుహాసనసన్నిభుండు ని
ష్కాముఁడు కుంభసంభవుఁడు సంతతము న్వసియించి యుండు మీ
రామునిదివ్యకోమలశుభాంఘ్రులకుం బ్రణమిల్లి యంతటన్.

1018


వ.

సముచితంబుగా నమ్మహాత్మునిచేత ననుజ్ఞాతు లై యగ్గిరివరంబు డిగ్గి.

1019


ఉ.

అమ్మలయాద్రిఁ జుట్టి సముదంచితనూతనపుష్పమాలచం
దమ్మున నొప్పుదాని సురతాపససేవిత యైనదానిఁ గెం
దమ్మికొలంకులం దనరుదాని ననోదక యైనదానిఁ దీ
రమ్ములవృక్షషండములఁ గ్రాలెడుదానిఁ గవేరకవ్యకన్.

1020


క.

కని తత్తీరవనంబుల, ఘనతరపుళినముల నవ్యకాసారములన్
జనగజను బంక్తికంఠుని, వినుతబలోదారులార వెదకుఁడు ప్రీతిన్.

1021


క.

అటఁ జని మనోజ్ఞగంధో, త్కటచందనమాలతీలతావిసరసము
త్కట యైనతామ్రపర్ణీ, తటినిం గని యాస్రవంతి తరియించి వెసన్.

1022


ఆ.

కాంత యైనయువతి కాంతునిఁ బోలె న
చ్చోటఁ దామ్రపర్ణి సురుచిరముగఁ
దవిలి సాగరంబుఁ గవుఁగిటఁ గదియించు
నట్టిదేశ మెల్ల నరసికొనుచు.

1023


వ.

అచ్చోటు వాసి హేమమయంబును దివ్యంబును యుక్తంబును ముక్తామణి
విభూషితంబు నగుపాండ్యులనగరద్వారకవాటంబు నిరీక్షించుచు నవ్వల సము
ద్రంబు దరిసి తత్తీరంబునఁ బున్నాగచందనకేతకీతాలవనంబులు విలోకింపుఁడు
తొల్లి మహాత్మం డగునగస్త్యుండు దేవపూజార్థంబు సంగ్రహించినపుప్పోపహా
రంబును వీచికాసందోహంబులచేత వితథంబుఁ జేసిన నయ్యగస్త్యుండు కోపించి
నిస్తరంగుండవు గ మ్మని శపించుటయుఁ దచ్ఛాపకారణంబున నాఁటంగోలె
సముద్రుండు నిస్తరంగుం డయ్యె నచ్చటిదేశం బంతరంగాభిధానం బనందనరు
నట్టిదేశంబున సీత నన్వేషించి యటమీఁద.

1024


సీ.

భర్మవిచిత్రంబు ప్రత్యంతపర్వతసంవేష్టితంబు విశాలఫుల్ల
వృక్షలతాగుల్మవిసరశోభితము కిన్నరయక్షచారణగరుడసిద్ధ