| |
వృతం బై యగమ్యం బై యుండు నది తుదిగా నిది మొదలుగా నీసందునం గల
కందువలెల్ల నరసి సీతారావణులచొ ప్పెఱింగి యొక్కమాసంబులోనఁ గ్రమ్మఱ
మత్సమీపంబునకుం జనుదెం డంతకు రాక మసలితిరేని తీవ్రం బగుమదీయ
దండంబునకుఁ బాత్రంబు లగుదు రని పలికి వెండియు మార్తాండనందనుం
డి ట్లనియె.
| 1009
|
| చ. |
వనచరులార మీ రతిజవంబున నాయెఱిఁగించినట్లు చ
య్యనఁ జని జానకి న్వెదకి యయ్యమఁ గన్గొని రండు వేగ య
త్యనుపమబుద్ధితోడ జనకాత్మజఁ గాంచితి నంచుఁ బల్కువాఁ
డనిశము రాఘవేంద్రకృప కర్హుఁ డగు న్భువనప్రసిద్ధుఁ డై.
| 1010
|
| ఆ. |
మఱియు నట్టిమేలుమాట చెప్పినవాని, రాజుఁ జేయుదు సగరాజ్య మిచ్చి
యతఁడు పుడమి యుండునంతకాలము లోక, పూజ్యుఁ డగుచు సిరులఁ బొల్చియుండు.
| 1011
|
| చ. |
అని యినజుండు పల్కినఁ దదాజ్ఞ శిరంబునఁ దాల్చి మ్రొక్కి కాం
చనగిరిసన్నిభుండు విలసద్భుజవిక్రమశాలి కాలదే
శనయవిదుండు గంధవహసన్నిభవేగుఁడు సూర్యతేజుఁడు
న్వినతుఁడు వోయెఁ దూర్పునకు వీరవలీముఖసైన్యయుక్తుఁ డై.
| 1012
|
| క. |
వెండియుఁ దనమనమున మా, ర్తాండసుతుఁడు యామ్యదిశకు నరిగి మహీజ
న్నిండారఁ గాంచి మరల న, ఖండగతి న్వచ్చునట్టికపు లెవ్వరొకో.
| 1013
|
సుగ్రీవుఁడు హనుమదాదుల దక్షిణదిక్కునకుఁ బొమ్మనుట
| చ. |
అని తలపోసి నీలుఁ బవనాత్మజు నంగదునిం గృశానునం
దనుల సుషేణుని న్గజునిఁ దారుని రంభు గవాక్షు గంధమా
దనుని సుహోత్రునిన్ గవయు ధాతృకుమారుని నస్త్రపుత్రులం
గనుఁగొని చేరఁ బిల్చి తగఁ గంజవనప్రియపుత్త్రుఁ డిట్లనున్.
| 1014
|
| చ. |
కపికులవర్యులార పతికార్యదురంధరులార మీకు బ
ల్నిపుణులు దేశకాలనయనిర్ణయశీలురు గావునం బరే
తపతి వసించు దిక్కునకుఁ దద్దయు వేగముతోడ వీరులం
గపులను గూడి సీత వెదకం జనుఁ డీరఘుభర్త మెచ్చఁగన్.
| 1015
|
| వ. |
తన్మార్గక్రమం బెట్టి దనిన నార్యావర్తదేశదక్షిణభాగంబును సహస్రశిరంబును
నానాద్రుమలతాయుతంబు నగువింధ్యపర్వతంబుఁ జేరి యందు సర్వస్థలంబు
నన్వేషించి తత్పర్వతపశ్చిమభాగంబున మహోరగనిషేవితంబు లైననర్మదా
భోగవతీపరదామేఖలోత్కలాప్రభృతినదీనదంబులును దశార్ణనగరంబులును
దక్షిణభాగంబునఁ గృష్ణవేణీమహానదియును ఋషికవిదర్భమాహిషికవంగ
కళింగకాశికవిషయంబులును బరిశోధించి తత్పూర్వభాగంబున సపర్వతనదీ
గుహం బైనదండకారణ్యంబు నెమకి తదంతర్వర్తిగోదావరీఖండంబును విలోకించి
|
|