Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/143

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


నమ్మహాతేజంబునకు సంహారవేళయందు సచరాచరం బైనతజ్జలం బింధనం బని
చెప్పుదురు తత్ప్రదేశంబునఁ దద్బడబాముఖంబు గని తదీయవేదన సహింపం
జాలక యాక్రోశించుజలచరభూతంబుల యాక్రందనంబు వినఁబడుచుండు నమ్మ
హోదధియుత్తరతీరంబున పదుమూఁడుయోజనంబులపొడువు నంతియవెడల్పు
నుం గలిగి జాతరూపశిలనామకం బైనయొక్కకనకపర్వతంబు గల దాశైలశిఖరా
గ్రంబున బూర్ణచంద్రప్రతీకారుండును సర్వభూతనమస్కృతుండును బద్మపత్రవి
శాలాక్షుండును నీలాంబరుండును సహస్రశిరుండు ధరణీధరుండు నగుననంతదే
వుం డనంతమహిమవిశేషంబున నాసీనుండై యుండు నమ్మహానుభావునకుఁ ద్రిశిరం
బై సువర్ణమయం బై సవేదికం బై తత్పర్వతాగ్రసంస్థాపితం బై తాలరూపకేతువు
విలసిల్లు నది పూర్వదిశావధిత్వంబునఁ ద్రిదశేశ్వరులచేతఁ గల్పితం బయ్యె దాని
విలోకింపుఁ డవ్వలఁ బుష్కరద్వీపమధ్యభాగంబున నఖండప్రభాపటలజటిలం
బై యుదయపర్వతం బొప్పు గగనంబుతో రాయుచు శతయోజనంబులపొడువు గ
లిగి ప్రతప్తకాంచనమయం బై వేదికాసహితం బై యప్పర్వతశిఖరం బొప్పు జాం
బూనదమయంబులును సుపుష్పితంబులును రవిసన్నిభంబులు నగుసాలతాలత
మాలరసాలకర్ణికారంబులు తదుపరిభాగంబున నలరారుచుండు నచ్చట యోజ
నవిస్తారంబును దశయోజనోత్సేధంబును గలిగి జాతరూపమయం బై సౌమనసం
బను వేఱొక్కశిఖరంబు గల దందుఁ దొల్లి దామోదరుండు త్రివిక్రమప్రస్తావం
బునందుఁ బూర్వపదంబుఁ బెట్టి రెండవపదంబు పశ్చిమదిగవధిభూతం బైనసావ
ర్ణినివాసమేరుశిఖరంబునఁ బెట్టె దివాకరుం డస్తమయానంతరంబున జంబూద్వీ
పంబు నుత్తరంబునఁ బరిక్రమించి మహోచ్ఛయం బైనతత్సౌమనసశిఖరంబుఁ
బ్రాపించి మేరుదక్షిణభాగవర్తుల కెల్ల భూయిష్టంబుగాఁ గానంబడుచుండు మఱి
యు నప్పర్వతశిఖరంబునందు వైఖానసులును వాలఖిల్యులును సూర్యకిరణంబు
లాహారంబుగాఁ గొని సూర్యతేజంబున దిశలు వెలుంగం జేయుచుఁ దపంబు సేయు
చుండుదురు తన్మహాతేజంబుమ్రోల శోభనం బై సుదర్శనాఖ్యం బగుద్వీపంబు
ప్రకాశించుచుండు సుమేరుశిఖరప్రదక్షిణదక్షుఁ డగుజగచ్చక్షుఁ డెద్దానిం బ్రాపిం
చి సమస్తప్రాణులకుఁ గన్నులకు వెలుంగై యుండు నప్పర్వతప్రాంతకాంతారకుంజ
పుంజసుందరకందరంబుల వైదేహీసహితంబుగా రావణు నన్వేషింపుఁడు మఱి
యు నక్కాంచనశైలతేజంబున సూర్యతేజంబున సమావిష్ట యై పూర్వసంధ్యారక్త
చ్ఛాయం దేజరిల్లు నేకారణంబున నీపృథివికి భువనంబునకుఁ బ్రథమద్వారంబు
గా బ్రహ్మచేత సృష్ట్యాదియందుఁ గల్పితం బయ్యె మఱియు సూర్యపరిభ్రమ
ణంబుకొఱకు మొదల నిది యుదయస్థానంబుగాఁ గల్పితం బయ్యె నక్కారణం
బున నిది పూర్వది క్కనం బరఁగుఁ దత్పర్వతపృష్టంబులందు నిర్ఝరంబులయందు
గుహలయందు వైదేహీసహితంబుగా రావణు నన్వేషింపుఁడు తత్పూర్వభాగం
బెల్ల చంద్రసూర్యరహితం బై తిమిరావృతం బై యదృశ్యం బై యింద్రాదిదేవా