Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


క.

ఘను లగుకీశులు ముందుగఁ, జని జానకి డాఁచి యున్నచంద మెఱిఁగి వ
చ్చినపిదప బలయుతులమై, మన మరుగుద మధికశక్తి మార్తునిపైకిన్.

1003


ఉ.

నీవె సమస్తకార్యములు నేర్పునఁ దీర్పఁగఁ జాలువాఁడవు
న్నీవె సఖుండ వాప్తుఁడవు నిర్మలకర్మవిధాయకుండవు
న్నీవె మహీసుత న్వెదకి నిక్కము దేఁ గలవాఁడ వార్యసం
భావిత వేయి యేటి కిఁక భారము నీయది గాదె చూడఁగన్.

1004


ఉ.

నా విని సూర్యజుండు వదనంబున మోద మెలర్ప ని ట్లను
న్దేవరవారికార్య మిటు దీర్చుట యే కద నాకుఁ గార్య మీ
రీవిధి నాన తీవలవ దేఁ గడవాఁడను గాను జానకి
న్వే వెదకంగఁ బుచ్చెదఁ బ్రవీణత వానరుల న్రఘూత్తమా.

1005


క.

అని పలికి సూర్యతనయుఁడు, తనమనమున ముదము గదుర దశరథతనయు
ల్వినుచుండ ఘనరవార్భటి, వినతుం డనుయూథపునకు వెస ని ట్లనియెన్.

1006

సుగ్రీవుఁడు వినతునిఁ దూర్పుదిక్కున సీతను వెదకఁ బొమ్మనుట

వ.

కపివర్యా నీవు దేశకాలనయజ్ఞుండవు కార్యాకార్యవినిశ్చయంబు నందునిపుణుం
డవు గమనాగమనవిచారతత్పరుండవు శైలసంకాశుండవు బలవంతుండవు గావున
సోమసూర్యాంశసంభవు లగువారి శతసహస్రవానరులం గూడి హిమాచల
వింధ్యమధ్యగతం బైనయార్యావర్తదేశంబు మొదలుకొని సరిద్గిరివనాకుల యైన
తూర్పుదిక్కునకుం జని యందు జాహ్నవియు సరయువుఁ గౌశికియుఁ గాళిందియు
సరస్వతియు సింధునదంబును శోణనదంబును బరిశోధించి తత్తీరవనంబులును
యామునాదిపర్వతంబులును వెదకి మహిని గాలమహినిం దిలకించి విదేహమాళవ
కాశీకోసలమగధపుండ్రవంగదేశంబులు పరీక్షించి యవ్వలఁ గోశకారులపట్టణం
బును రజతాకరభూమియు శోధించి యచ్చటిగిరిశృంగంబులందును వనంబులం
దును నదులయందును వైదేహిని రావణునినిలయంబును విమర్శించి యవ్వల
సముద్రాంతగతంబు లైనపర్వతంబులును వనంబులును బట్టణంబులునుం జూచి
యటమీఁద మందరకోటిసంశ్రితులును గర్ణప్రావరణులు నోష్ఠకర్ణులును లోహ
ముఖులు నేకపాదులును బలవంతులు నక్షయ్యులును గర్ణచూడులును బురుషా
దకులును హేమాంగులు నగుకిరాతులు కాఁపున్నస్థలంబులు విలోకించి యవ్వల
నంతర్జలచరులును ద్వీపవాసులు నామమీనాశనులును ఘోరరూపులును
నరరూపవ్యాఘ్రరూపులు నగుమఱికొందఱు కిరాతులు కాఁపున్నదేశంబు
లన్నియుఁ గామరూపు లై వెదకి యవ్వల గిరులచేత లంఘనంబుచేత నుడుపం
బులచేత నధిగమింపం దగినద్వీపాంతరంబు లతిక్రమించి యవ్వల యవద్వీపం
బన నొక్కయుపద్వీపంబు గల దది రత్నవంతంబై సప్తరాజ్యోపశోభితం బై
యుండు దానిని సువర్ణాకరమండితం బగుసువర్ణరూప్యకం బనుద్వీపంబు నతిక్ర
మింపుఁ డవ్వల.

1007