Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


బ్రాక్పర్వతమునందుఁ బశ్చిమగిరియందు ధూమ్రాద్రియందు దుర్దురమునందు


తే.

మఱియు నానాటవీద్వీపశరధినిమ్న, గాసరోవరకటకసంకటములందు
వసతిఁ గావించి యున్నదుర్వారబలుల, వృక్షచరులను వేగ రావింపు మనఘ.

920


శా.

ధీరోదారులు సింహవిక్రముల నుద్దీప్తప్రతాపాఢ్యులన్
వీరోత్తంసుల మేఘవర్ణుల జగద్విఖ్యాతశౌర్యోల్లస
ద్ఘోరాకారుల వానరప్రవరుల న్దోడ్తేరఁగా మున్నె సొం
పారం జారులఁ బుచ్చినాఁడను సమస్తాశావకాశంబులన్.

921


క.

నావచనంబున నీవును, భూవల్లభుకార్యసిద్ధి పొంటెఁ బ్లవగులన్
ధీవిలసితులను దొల్లిఁటి, త్రోవల వెసఁ బుచ్చు మిటకుఁ దోడ్తెచ్చుటకున్.

922


వ.

మఱియుఁ దరుణాదిత్యవర్ణులును గాంచనాచలసంకాశులును నీలజీమూతసన్ని
భులును భీమకాయులును బద్మతాళవనవాసులును గుంజరప్రతిమౌజులును మన
శ్శిలాగుహావాసులును గనకప్రభులును దాపసాశ్రమనిలయులును దీర్ఘసూత్రు
లును మధుమైరేయాసవగంధసంవాసితముఖులు నగువీరవానరుల సామదానా
ద్యుపాయంబులచేతఁ దోడి తెచ్చుటకు నేర్పరు లగుగతిజ్ఞుల మదీయశాసనంబు
నం బుచ్చుము వా రామున్ను పంపఁబడిన దూతల వేగిరపఱిచి కామప్రసక్తు
లై దీర్ఘసూత్రు లగువనచరుల నందఱను శీఘ్రంబునఁ దోడ్కొనివచ్చువారు
గా నాజ్ఞాపింపుము.

923


క.

పదిరాత్రములకు నెవ్వఁడు, మదయుతుఁ డై రాక యచట మసలు నతఁడు బె
ట్టిదముగ నాచే మిక్కిలి, పదపడి హంతవ్యుఁ డనుచుఁ బలుకుము వీటన్.

924


క.

పొలివోవ కుండ జగతిం, గల వానరు లెల్ల రామకార్యార్థముగా
బలదర్పములు సెలంగఁగఁ, గలసి మెలసి వచ్చువారుగాఁ జేయు మొగిన్.

925


క.

నా విని మరుత్తనూజుఁడు, భూవరుకార్యంబుపొంటె భూరిబలుల సు
శ్రీవిభవయుతులఁ గీశుల, ధీవరులను వేగ నెల్లదిక్కుల కనిచెన్.

926


ఉ.

పంపిన వారు తీవ్ర యగు భానుకుమారునియాజ్ఞ నుర్వి కం
పింపఁగ నప్పుడే కదలి భీషణభంగి నభోంతరంబునన్
గుంపులు గట్టి పోయి వనగోత్రపయోధినివాసుల న్సమి
ల్లంపటుల న్వనాటుల విలంబము లేక నృపాజ్ఞ దెల్పినన్.

927


ఉ.

వారును మృత్యుతుల్యుఁ డగువారిజమిత్రకుమారునానతి
న్మీఱఁగ లేక బంధుసుతమిత్రసహోదరయుక్తు లై రయం
బారఁగఁ దత్క్షణంబ భయదార్భటు లొప్ప నభఃప్రచారు లై
భూరిజవంబునం గదలిపోవఁ దొడంగిరి రాజువీటికిన్.

928

సమస్తదేశముల నుండువానరులు కిష్కింధకు వచ్చుట

చ.

ఉడుగక యంజనాచలము నుండి నవాంజనసన్నిభాకృతుల్