Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాముఁడు లక్ష్మణుని శాంతి నొందించి సుగ్రీవునికడకుఁ బంపుట

తే.

సచివసంహననాధ్యవసాయరూప
వృజిన మొనరింప రెండుఁ ద్వద్విధజనములు
ఘనవివేకంబుచేఁ బాతకము నణంచు
నతని మఱి పురుషోత్తముఁ డండ్రు బుధులు.

792


క.

కడువడిఁ జేతోమోహం, బడరఁగ నే నన్నమాట లాలింపక యి
ప్పుడు రవిజునిపై మును నే, ర్చెడుసౌహృదగౌరవంబుఁ జేర్పుము ప్రీతిన్.

793
క.

రవిసుతునిఁ గానఁ జను మిపు, డవమతి గావించి పరుష మాడక పాప
వ్యవసాయ ముడిగి కడు సాం, త్వవచనముల పలుకు కార్యదశ దెలియంగన్.

794


ఆ.

అనిన నట్ల కాక యని సుమిత్రాపుత్త్రుఁ డన్నచరణములకు నధికభక్తిఁ
బ్రణతుఁ డై తదాజ్ఞ పాటించి వానర, నేతపాలి కరుగ నిశ్చయించి.

795


సీ.

కాలదండాభీలకార్ముకదండంబు తపనీయరుచుల హస్తమునఁ గ్రాలఁ
గ్రూరసర్పాభీలఘోరనారాచము ల్కడుదీర్ఘ మగునిషంగమునఁ దనర
పవిసన్నిభస్పర్శపాదఘట్టనమునఁ గొండలఱా లెల్ల పిండి గాఁగ
నూరువేగసముధ్ధితోరువాతస్ఫూర్తి వివిధవృక్షంబులు విఱిఁగి కూల


తే.

బొమలు ముడివడఁ గనుల రక్తిమ చెలంగ
నధరము చలింప రౌద్ర మంతంత కెదుగ
నిడుదజంగలు వేయుచుఁ బుడమి వడఁకఁ
గడురయంబున సౌమిత్రి తడయ కరిగె.

796


వ.

మఱియు మహాప్రాజ్ఞుండును భ్రాతృప్రియహితరతుండును శుభబుద్ధియు నగు
లక్ష్మణుండు ప్రతినివృత్తహననాధ్యవసాయుండై బృహస్పతిసమబుద్ధి యగుటం
జేసి సుగ్రీవు నుద్దేశించి తనచేతఁ బలుకం దగినరామోపదిష్టవచనంబును దన
మాటకు సుగ్రీవునిచేతఁ బలుకం బడియెడునుత్తరంబును దానికిఁ దనచేత
వక్ష్యమాణం బైనయుత్తరంబును విచారించి జంతుపారణకళాలోలుం డైన
కాలునిపోలిక విచిత్రధాతురాగసముద్దీపితసానుసుందరం బైనమందరంబు
చందంబున వాత ప్రేరితం బైసవహ్నిరీతినంబరమధ్యగతుండగు పుండరీకవనబం
ధునిమాడ్కిఁ జూడ్కికి వ్రేఁగగుచు నిజదేహప్రభాజాలంబున నక్కాన వెలిం
గించుచు నమోఘరయంబునం జని చని ముందఱ ననతిదూరంబున.

797


క.

నరవరమానుఁడు దుర్గమ, గిరిసంకటమందు ఘోరకీశచమూసం
భరితం బగుకిష్కింధా, పురమును విభవజితనాకపురముం గాంచెన్.

798

లక్ష్మణుఁడు కిష్కింధఁ జేరుట

క.

కని దానిమహిమ కెంతయు, మనమున నచ్చెరువు గదుర మఱిమఱి డాయం
జని పురి బాహ్యవనంబులఁ, గనుఁగొనియెన్ గుధరభీమకాయులఁ గపులన్.

799