Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/113

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


ప్పుడు కడుఁ దీవ్రవేగమున బొక్కలు వెల్వడి వాతదుర్విషం
బడరఁగ నూర్పు గాడ్పు లొలయం జరియించెడుఁ గంటె లక్ష్మణా.

764


తే.

చంచదిందుకరస్పర్శసముదితప్ర, హర్షవికసితతారక యగుచు నిపుడు
రాగవతి యైనసంధ్య కరంబు తానె, యంబరంబును విడిచెను ననఘ కంటె.

765


ఉ.

లాలితచంద్రమండలవిలాసిసువక్త్రయుఁ దారకాగుణో
న్మీలితచారునేత్రయు వినిర్మలమంజులనవ్యచంద్రికా
చేలయు నై శరద్రజనిచెల్వు వహించెఁ గుమార చూడు మీ
వేల సుధౌతచేలమును బేరిమిఁ దాల్చినకాంతకైవడిన్.

766


క.

అసదృశవిపక్వశాలి, ప్రసవంబులు మెసవి మింటఁ బన్ని చనెడుసా
రసపంక్తి ప్రహర్షిత యై, శ్వసనసముద్ధూతతూలభంగిఁ గుమారా.

767


క.

కుముదోపేతము సుప్త, కమరాళము నై హ్రదస్థకాండము కంటే
విమలోడుయుతము శశియు, క్తము నగురజనీనభంబుకరణి నలరెడిన్.

768


ఉ.

పూచినపద్మకోకనవపుష్పము న్మధు వాని తుమ్మెద
ల్వీచులమీఁద రేఁగి సరవిన్ రొద సేయ మరాళదంపతుల్
వేచి మృణాళముల్ మెసవి వేమఱుఁ జారురతిప్రసంగసం
సూచన చేయుచున్నయని చూచితె రమ్యసరోవరంబులన్.

769


మ.

కనుఁగొంటే నృపపుత్త్ర ధౌతవిమలక్షౌమాంబరోల్లాసికా
శనికాయంబులు మందమంజులమరుత్సంచాల్యమానంబు లై
కనదుద్యత్కుసుమప్రభాసములు నై కందోయికి న్వేడుకల్
జనియింపం దటినీతటంబుల నలక్షచ్ఛాయఁ జూపట్టెడిన్.

770


తే.

కుసుమమకరందరసముకు గ్రోలి వేడ్క, నంబురుహరేణుగౌరంబు లై మదించి
యాఁడుతేఁటులఁ గూడి వాతానుయాత్ర, సలుపుచున్నవి కంటివే షట్పదములు.

771


క.

ప్రవిమలుఁ డగుచంద్రుఁడు మృదు, పవనుఁడు క్రౌంచస్వనము విపక్వకలమశా
లివనము రమ్యజలముకై, రవరమ దెల్పెడి లసచ్ఛరత్కాలగతిన్.

772


వ.

మఱియుఁ బ్రకీర్ణహంసాకులమేఖలలును బ్రబుద్ధపద్మోత్పలమాలికలు నగుదీర్ఘి
కల రమణీయకాంతివిభూషిత లగుపరాంగనలకాంతిపగిది మిక్కిలి ప్రకాశించు
చున్నయది ప్రత్యూషకాలంబునందు గోపాలకులు సేయువేణువాద్యస్వనంబు
లును గోపికలు సేయుదధిమథనభాండశబ్దంబులును గోవృషంబులు సేయు
మహానాదంబులును బవనసంప్రవృద్ధంబు లై యిక్కాలంబున వినంబడుచుండు
మీనోపసందర్శితమేఖల లగునదీయువతులగమనంబులం బ్రభాతకాలంబు
నందుఁ గాంతోపభుక్తాలసగామిను లగుకామినులగమనంబులుంబోలె మందం
బులై యున్నయవి సచక్రవాకంబులును సశైవలంబులును గాశసంవృతంబులును
నగునదీముఖంబులు సపత్రలేఖంబులును సరోచనంబులును దుకూలసంవృతం