| సీ. |
ఏరామ విమలకాసారతీరవిహారి కలహంసిపద్ధతిఁ గలసి యాడు
నేతన్వి చూతభూజాతవల్లవఖాది కలకంఠిపద్ధతిఁ గలయ మ్రోయు
నేతలోదరి దాడిమీతరువ్యాలంబి రాజకీరప్రౌఢి రద్దు సేయు
నేరాజవదన శృంగారశాద్వలచరత్పృషదంగనాస్ఫూర్తి బెదరి చూచు
|
|
| తే. |
నట్టిజానకి నాయుల్ల మధికహర్ష, కలిత మగునట్టు లెప్పుడు గానవచ్చు
నెట్లు పరిరంభణస్ఫూర్తి నైనఁ గలుగు, నీవియోగాబ్ధి తరియింప నెపుడు వచ్చు.
| 729
|
| తే. |
సారసారవనముదితస్వనముచేత, నాశ్రమంబున విహరించునట్టి బాల
జనకనందని దుష్టరాక్షసునిచేతఁ, జిక్కి యెబ్బంగిఁ జరియించుఁ జెపుము నాకు.
| 730
|
| క. |
కుసుమితకాంచనమయలస, దసనరసాలద్రుమముల నటు చూచుచు నా
బిసరుహముఖి ననుఁ గానక, నసువుల నేక్రియ ధరించు నక్కట చెపుమా.
| 731
|
| క. |
కలహంసరవంబు మే, ల్కొలుపం బడునట్టిసీత క్రూరక్రవ్యా
దులరవములచే నెటు మే, ల్కొలుపం బడు నెట్లు సైఁపఁగూడు న్నాకున్.
| 732
|
| తే. |
సంతతంబును సహచరచక్రవాక, కలరవంబులు వినియెడుకలువకంటి
దారుణాకారదుర్మదక్రూరదనుజ, వికృతహుంకృతు లెబ్భంగి వినఁగ నేర్చు.
| 733
|
| ఉ. |
ఒంటిగ నాశ్రమంబున సముత్సుకత న్జరియించువేళలన్
గొంటరిజంటకోవెలలు గూయఁగ మేను చెమర్ప నాత్మలో
నంటినభీతి వచ్చి బిగియ న్ననుఁ గౌఁగిటఁ జేర్చునట్టివా
ల్గంటి మహీజ నెమ్మనము గందదె శారదకాలసంగతిన్.
| 734
|
| ఉ. |
అక్కట సీత దైత్యహృత యై వెతలం బడి కుందుచుండ నా
కిక్కడిరమ్యకందరము లిక్కడినవ్యసరోవరోత్కరం
బిక్కడికాననప్రచయ మిక్కడినూతనశీతసైకతం
బిక్కడివల్లికాగృహము లించుక చూడ్కికి వేడ్క సేయునే.
| 735
|
| ఉ. |
మక్కువతోడ న న్గలసి మాటికి నిచ్చ సుఖించునట్టి యా
చక్కనిగోల యొంటిమృగశాబముకైవడిఁ జిక్కి యుండఁగా
నక్కఁట తచ్ఛరద్గుణనిరంతరుఁ డై కుసుమాంబకుండు తా
మిక్కుట మైనగర్వమున మిన్నక పీడ యొనర్పకుండునే.
| 736
|
| వ. |
అని యివ్విధంబున నమ్మహీరమణుండు పురందరునివలన సలిలంబు నుద్దేశించి
విలపించుచాతకంబుభంగి నతిదీనుం డై విలపించుచు వెండియు లక్షణవంతుం
డైన లక్ష్మణాగ్రజుండు పుష్పితమహీరుహలతావితానరంజితధరాధరసానుకంద
రంబులు విలోకించి ముద్దియం దలపోసి తద్దయు మోహాతురుం డై.
| 737
|
రాముడు శరదృతువునందు సీతం దలంచుకొని దుఃఖించుట
| చ. |
కనుఁగన మోడ్చు విచ్చుఁ దమకంబున నాకస మట్టె చూచు నె
|
|