ప్రసంగాలు
59
బుద్ధిహీనత మరొకటి లేదు. ఎందుకంటే యీ విధంగా చేసి మిమ్మల్ని మీరే ధ్వంసం చేసుకుంటున్నారు, మీ శక్తిని ధ్వంసం చేసుకుంటున్నారు. యదార్థమైన 'వున్నది' ని మీరు చూసినప్పుడు శక్తి వస్తుంది. అంటే అర్ధం పోల్చిచూడటంలో శక్తి వృథా అవడం లేదనమాట.
దుఃఖం అంటే ఏమిటి అని అడుగుతున్నాం. దుఃఖాన్ని జయించడానికి మానవుడు అనేక మార్గాలు అవలంబించాడు- పూజల ద్వారా, పారిపోవడం ద్వారా, త్రాగుడు ద్వారా, వినోదకాలక్షేపం ద్వారా ప్రయత్నాలు చేశాడు. అయితే దుఃఖం మాత్రం అట్లాగే వుండిపోయింది. దుఃఖాన్ని కూడా తక్కిన అన్నింటిలాగా అవగాహన చేసుకోవలసిందే. దానిని నిరాకరించకండీ, అణచిపెట్టకండి, దానిని తట్టుకోవడానికి ప్రయత్నించకండి; అర్ధం చేసుకోండి. అది ఏమిటో బాగా పరికించి చూడండి. దుఃఖం అంటే ఏమిటి? నేను మీకు చెప్పాలా? ప్రేమిస్తున్నానని మీరు అనుకుంటున్న వ్యక్తిని మీరు పోగొట్టుకుంటే దుఃఖం; పూర్తిగా, సంపూర్ణంగా సఫలత చెందలేక పోవడం దుఃఖం; అర్హత, అవకాశం మీకు దొరకనప్పుడు దుఃఖం; సఫలత చెందాలని మీరు కోరుకుంటూ, సాఫల్యం చెందడానికి ఏ మార్గమూ లేనప్పుడు దుఃఖం; మీ లోపల వున్న ఏమీలేని ఖాళీతనం, ఒంటరి తనం మీ ఎట్ట ఎదుట నిలబడి ప్రశ్నిస్తున్నప్పుడు దుఃఖం; ఇంకా తన మీద తనకే జాలి అనే బాధ కూడా దుఃఖంలో వుంటుంది. తన మీద తనే జాలిపడటం అంటే ఏమిటో మీకు తెలుసా? మిమ్మల్ని మీరే నిందించుకోవడం, మీకే తెలియకుండానో, ఒక్కొక్కసారి తెలిసి కూడా, మీ మీద మీరే సానుభూతి కురిపించుకోవడం. 'నేనిప్పుడున్న స్థితిలో, చుట్టు వున్న వాతావరణానికి విరుద్ధంగా ఏమీ చేయలేను' అని అనడం. మిమ్మల్ని మీరే ఒక పీడగా భావించుకోవడం, మీ పరిస్థితికి మీరే దిగులు చెందడం. అదే మీమీద మీరే జాలిపడటం అంటే స్వీయానుకంప. దుఃఖం ఆవిధంగా వుంటుంది.
దుఃఖాన్ని అర్థంచేసుకోవాలంటే మొదట యీ స్వీయ అనుకంప గురించి ఎరుక కలగాలి. దుఃఖానికున్న కారణాల్లో యిదీ ఒకటి. ఒక మనిషి చనిపోవడం వల్ల మీరు ఒక్కరే మిగిలినప్పుడు, మీరు ఎంతో ఒంటరిగా వున్నారు అనే స్పృహ మీకు కలుగుతుంది. ఒక మనిషి చనిపోవడం వల్ల డబ్బు, ఆదాయం ఏమీ లేక, మీకు భద్రత వుండదు. ఇతర్ల మీద ఆధారపడి జీవిస్తారు. ఆ పైన యిబ్బందుల గురించి చెప్పుకోవడం మొదలు పెడతారు, మీ మీద మీకే జాలి ఆరంభమవుతుంది. కాబట్టి, దుఃఖానికి వున్న కారణాల్లో ఒకటి స్వీయానుకంప; ఇది వాస్తవం; మీరు ఒంటరిగా వున్నారన్న వాస్తవంలాగే యిదీ ఒక వాస్తవం. 'ఉన్నది' అంటే యిదే. స్వీయాను