Jump to content

పుట:కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

58

కృష్ణమూర్తి తత్వం

దారితీస్తుంది. చాలా అందమైన ఒక శిరస్సును చూస్తారు. దానివైపు బాగా పరికించి చూస్తారు. “ఇది చాలా అందమైన శిరస్సు, చక్కని తలకాయ, మంచి తలకట్టు వుంది” అని ఆలోచన ఉంటుంది. దాన్ని గురించి యింకా ఆలోచించడం ఆరంభిస్తుంది. అది చాలా సుఖంగా, సంతోషంగా అనిపిస్తుంది.

ఆలోచన లేకుండా ఒకదానిని చూడటం అంటే అర్ధం మీరు ఆలోచించడం మానివేయాలని కాదు. అసలు అంశం అది కాదు. కోరిక అంటే- చూడటం, యింద్రియానుభూతి చెందడం, పరిచయం అని తెలుసుకొని, కోరిక మధ్యలో ఆలోచన దూరి కల్పించుకున్నప్పుడు, మీలో ఆ ఎరుక వుండాలి. కోరిక పని చేసే ప్రక్రియ అంతటిని గురించీ, కోరిక కలిగిన ఆ క్షణంలోనే ఆలోచన దానిమీద పడి తొందర పెట్టడం గురించీ ఎరుకతో వుండాలి. దీనికి తెలివి తేటలే కాకుండా ఎరుకతో వుండవలసిన ఆవశ్యకత కూడా వున్నది. అంటే అపూర్వమైన సౌందర్యాన్ని కాని, అపూర్వమైన వికృత రూపాన్ని కొని చూసినప్పుడు ఎరుకగా వుండటం. అప్పుడు మనసు పోల్చి చూడదు. సౌందర్యం వికృతత్వం కాదు, వికృతత్వం సొందర్యం కాదు. కాబట్టి సుఖాన్ని అవగాహన చేసుకోవడం ద్వారా దుఃఖాన్ని గురించి తరచి శోధించ వచ్చును.

దుఃఖం గురించి తెలుసుకోకుండా మీరు ఏం చేసినా సరే- అత్యున్నతమైన సాంఘిక హోదాను, అధికార హోదాను, ఆధ్యాత్మిక అంతస్తును, రాజకీయ హోదాను. దేన్ని అధిరోహించినా సరే- మీరు మాత్రం ఏదో విధంగా కీడు చేస్తూనే వుంటారు. మీ దేవుడు పేరు చెప్పుకొనో, మీ దేశం పేరు చెప్పుకొనో, మీ పార్టీ, మీ సమాజం, మీ సిద్దాంతాల పేరు చెప్పుకొనో కీడు చేస్తూనే వుంటారు. హానికారకులవుతారు మీరు. అందులో సందేహం లేదు.

సరే, దుఃఖం అంటే ఏమిటి? మళ్ళీ ఒకసారి 'వున్నది' ని చూడండి; 'ఏది వుండాలి' ని కాదు. ఎందుకంటే, మీరు బాగా అర్థంచేసుకొని వుంటే, పోల్చి చూడటం యిప్పుడు మానేసి వుంటారు. కేవలం 'వున్నది' ని మాత్రం చూస్తారు. అందువల్ల పరికించి చూడటానికి మీకు శక్తి వుంటుంది. పోల్చి చూడటంలో ఆ శక్తి వృధా అయిపోకుండా వుంటుంది. మానవుడికి వున్న సమస్యల్లో ఒకటి ఏమిటంటే శక్తి ఎట్లా వస్తుంది అనేది. నీచమైన, అల్పమైన మనుస్సులున్న యీ మతవాదులే మళ్ళీ, శక్తి కావాలంటే బ్రహ్మచర్యం అవలంబించాలి, శక్తి సంపాదించాలంటే మీరు ఆకలితో కృశించాలి, వుపవాసాలు చేయాలి, ఒక్క పూటే భోంచేయాలి, గోచీపాత ధరించాలి, పొద్దున రెండు గంటలకి లేవాలి, ప్రార్థనలు చేయాలి' - అని అన్నారు. ఇంతకంటే