ప్రసంగాలు
57
పుషాకాంతిలో మెరిసిపోతూ, ఏకాంతంగా వున్న నిండైన వుజ్వల రమణీయ ప్రకాశం అది. దాన్ని నేను చూస్తాను. ఆపైన ఆలోచన యిట్లా అనడం మొదలు పెడుతుంది, 'ఎంత అందంగా వుంది! ఎల్లకాలం దీనినే చూస్తూ వుండిపోవాలని వుంది' అని. ఆలోచన అంటే స్మృతి మనం చూసినదానికి ప్రతిస్పందించడం- అది యిట్లా అంటుంది, 'నాకు అక్కడ నివసించాలని వుంది' అని. లేదూ ఒక అందమైన ముఖాన్ని నేను చూస్తాను. ఆ ముఖాన్ని గురించి ఆలోచిస్తాను. ఆపైన నిరంతరంగా దాన్ని గురించే ఆలోచించడం సుఖాన్ని యిస్తుంది. సెక్స్- మీరు అనుభవించిన ఆ సుఖం, దానిని గురించి, మీలోపల అది వదిలిన మనోబింబం గురించి మీరు ఆలోచిస్తూ వుంటారు. ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువ సుఖం మీకు. ఆ తరువాత కోరిక, ఆలోచన సుఖాన్ని కొనసాగించడాన్ని తీసుకువస్తుంది. ఇదంతా వివరంగా తెలుసుకుంటే చాలా సుకరంగా మీకు బోధపడుతుంది.
ఇప్పుడు, ఒకరు అడుగుతారు, 'కోరికను తాకకుండా వుండటం ఆలోచనకు సాధ్యమేనా' అని అర్థమవుతున్నదా? ఈ సమస్య మీది. సజీవత్వంతో, సొందర్యంతో తొణికిసలాడుతున్న అసాధారణమైన అందాన్ని చూసినప్పుడు, ఆలోచనను. అక్కడికి రానివ్వకూడదు. ఎందుకంటే ఆలోచన దానిని తాకిన క్షణమే, ఆలోచన పాతది కాబట్టి, ఆలోచన దానిని ఒక సుఖంలాగా వక్రీకరిస్తుంది. అందువల్ల సుఖంకోసమూ, మరింత మరింత సుఖం కోసమూ ఒత్తిడి బయలుదేరుతుంది. అది మనం యివ్వకపోతే సంఘర్షణ బయలుదేరుతుంది, భయం కలుగుతుంది. కాబట్టి, ఒక విషయంవైపు ఆలోచన లేకుండా చూడటం సాధ్యమేనా? అట్లా చూడాలంటే అఖండమైన సజీవత్వంతో మీరు వుండాలి, కదలలేని దుర్భలస్థితిలో కాదు. అయితే, మత బోధకులు, 'కదలిక లేని దుర్భల స్థితిలో పడివుండండి, పరమ సత్యాన్ని అందుకోవడానికి అవిటితనంతో రండి' అని మీతో అన్నారు. కానీ, అవిటితనంతో మీరు పరమసత్యాన్ని చేరుకోలేరు. సత్యాన్ని చూడాలంటే నిర్దుష్టత గల మనసు, ఏ వైకల్యాలూ లేని, సహజ స్వచ్చత్వంతో వుండే మనసు, గందరగోళంలో లేని, చిత్రహింసలకు లోనుకాని, స్వేచ్ఛగా వున్న మనసు కావాలి. అప్పుడే సత్యాన్ని చూడగలుగుతారు. ఒక చెట్టువైపు చూస్తున్నప్పుడు, స్పష్టంగా వున్న కళ్ళతో, ఏ మనోబింబమూ లేకుండా, చెట్టుని మీరు చూడాలి. ఆలోచన కోరిక గురించి ఆలోచించినప్పుడు - ఆలోచన నిరంతరం కోరిక గురించే ఆలోచిస్తుంది. అందులో అది సుఖాన్ని పొందుతుంది. ఆలోచన ఒక వస్తువుని గురించిన మనోబింబాన్ని సృష్టిస్తుంది. ఆ కాల్పనిక బింబాన్ని గురించి, ఆ చిహ్నాన్ని గురించి, ఆ బొమ్మని గురించి ఎప్పుడూ ఆలోచిస్తూవుండటం సుఖానికి