42
కృష్ణమూర్తి తత్వం
భద్రతల కోసం, అంటే ప్రాణాలతో బ్రతికి వుండటం- అనే దానికోసం జరుగుతుంది. జీవశక్తి, కదలిక, బ్రతికి వుండటం కోసం తయారు చేసుకున్న పద్దతిలో చిక్కుకొని పోవడం, ఆ వరవడిలోనే మళ్ళీ మళ్ళీ చేస్తూ వుండటం- యిదే ఆలోచనకు ఆరంభం. ఆలోచనే మనస్సు. శక్తి అంటే కదలిక. ప్రాణాలతో బ్రతికి వుండటం కోసం ఏర్పరుచుకున్న పద్దతిలో చిక్కుకు పోయిన ఆ కదలిక, సుఖపడటం, భయపడటం అనేవి మళ్ళీ మళ్ళీ చేస్తూ వుండటం ద్వారా బ్రతికి వుండటం- అదీ ఆలోచనకు ఆరంభం.
పోగు చేసుకున్న స్మృతులు, పోగు చేసుకున్న పద్ధతులు ప్రతి స్పందించడమే ఆలోచన. ఒక హిందువుగానో, ఒక ముస్లింగానో, పార్శీగా, క్రిస్టియనుగా, కమ్యునిస్టుగా, సోషలిస్టుగానో లేదా మరొకరిగానో మీరు చేస్తున్నది యిదే. ఒకే నమూనాలోని పద్దతుల్లోనే మనం పనిచేస్తుంటాం. ఒక పద్దతినే మళ్ళీ చేయడం అంటే ఆలోచన్లని పునరుక్తి చేయడం; మళ్ళీ మళ్ళీ అనేకసార్లు అదే చేయడం. ఒక హిందువుగానో, ముస్లింగానో, ఒక పార్శీగానో మీరు చేస్తున్నదీ అదే- హిందూ సంస్కృతి, ముస్లిం సంస్కృతి లేదా పార్శీ సంస్కృతీ అనే చట్రంలో బిగించుకొని పోయిన ఒక పద్ధతినీ, ఆంతరించి పోకుండా సజీవంగా వుంచడంకోసం, మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. ప్రతి ఒక్కరి లోపల నిజంగా జరుగుతున్నది యిదే. ఆలోచన ఎప్పుడూ ఒక పద్ధతిని స్థాపించుకుంటూ వుంటుంది. పాత పద్ధతి కనుక 'సరిపోకపోతే' మరో పద్ధతిని స్థాపించుకుంటుంది. పెట్టుబడిదారీ పద్దతి కనుక సవ్యంగా లేకపోతే, అప్పుడు కమ్యునిజమ్ బాగా పనిచేస్తుంది; అదీ ఆ కొత్త పద్ధతి. అట్లాగే హిందూమతమో, క్రైస్తవమతమో సౌకర్యంగా లేదనుకుంటే మరో కొత్త విధానాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారు.
కాబట్టి, ఒక పద్ధతిని మళ్ళీ మళ్ళీ చేయడం అన్నది మెదడులోని కణాలను-అవి పదార్థం- వాటినే నిబద్దీకరణం చేసివేస్తున్నది. ఆలోచన కూడ పదార్థమే. ఇది మనకు మనమే నిరూపించుకోవచ్చు. ఇదీ మీరు ప్రత్యక్షంగా తెలుసుకోవాలి, యీ వక్త చెపున్నాడని కాదు. దానికి ఏ మాత్రం విలువ యివ్వకండి. ఇది ఎట్లా వుంటుందంటే, బాగా ఆకలిగా వున్న మనిషితో భోజనం బ్రహ్మాండంగా రుచిగా వుంటుంది అని చెప్పి, అతను తినడానికి సిద్ధాంతాలను పెట్టినట్లుగా వుంటుంది. ఈ దేశంలో అదే జరుగుతున్నది. తినడానికి సిద్ధాంతాలను, ఆదర్శాలను మీకు పెడుతున్నారు. బౌద్ధ సిద్ధాంతం, హిందూ ఆదర్శం, శంకరాచార్య సిద్ధాంతం యింకా అటువంటివి. మీ మనసులు ఖాళీగా వున్నాయి కాబట్టి మాటలను మీకు ఆహారంగా పెడుతున్నారు. ఈ కారణంగా అస్తవ్యస్తత వున్నది. అందువల్ల యిదంతా త్రోసి అవతల పారేయాలి, కొత్తదానిని ఆరంభించడం కోసం. కొత్తగా ఆరంభించాలంటే