38
కృష్ణమూర్తి తత్వం
క్రమతను; రోజువారీ కార్యక్రమం లాంటిది కాదు. రోజూ నిత్యకృత్యం లాగా చేయడ మనేది మృతప్రాయమైనది. కాలేజీ పరీక్షల్లో వుత్తీర్ణులయీ అవగానే- ఒక వుద్యోగం కనుక మీరు సంపాదించగలుగుతే, ఆఫీసుకు పోవడం మొదలు పెడతారు. ఇక ఆ తరువాత నలభై, యాభై సంవత్సరాలు వరుసగా ప్రతిరోజూ ఆఫీసుకు వెళుతూనే వుంటారు. అటువంటి మనస్సు ఏమయిపోతుందో మీకు తెలుసునా? ఒక దైనందిన కార్యక్రమాన్ని మీరు అలవాటు చేసుకున్నారు; అదే ప్రతీ రోజూ మళ్ళీ మళ్ళీ చేస్తూ వుంటారు. పిల్లల్ని కూడా యిటువంటి కార్యక్రమం ప్రతిరోజూ వరుసగా చేయమని ప్రోత్సహిస్తారు. సజీవంగా వున్న ఏ మనిషైనా దీనికి తిరగబడవలసిందే. కొని, "నాకు బాధ్యతలున్నాయి; నేనుండే పరిస్థితుల్లో యిష్టమున్నా లేకపోయినా యిది వదలలేను" అని మీరు అంటారు. ప్రపంచం యిట్లాగే నడుస్తూ వుంటుంది. విసుగెత్తేటట్లుగా చేసినదే చేయడం, మార్పులేని స్తబ్దత్వం, బొత్తిగా ఏమీ లేని ఖాళీతనం- వీటితో జీవితం సాగిపోతూ వుంటుంది. దీన్నంతటినీ వ్యతిరేకిస్తూ మనిషిలోని వివేకం తిరగబడుతున్నది.
అందువల్ల ఒక కొత్త సక్రమ వ్యవస్థ, ఒక కొత్త జీవిత విధానం వచ్చి తీరాలి. ఆ కొత్త క్రమత, కొత్త జీవితవిధానం రావాలంటే ప్రస్తుతం వున్న అస్తవ్యస్తతని అర్ధం చేసుకోవాలి నిరాకరించడం ద్వారానే అసలైనదానిని మీరు అర్ధంచేసుకోగలుగుతారు తప్ప, అసలైనదాని కోసం ఆరాటపడటం ద్వారా కాదు. సర్! మీకు అర్థమైందా? ప్రతికూలంగా వుండేదానిని తిరస్కరించినప్పుడు, త్రోసిపారేసి నప్పుడు; మానవులే సృష్టించిన సమస్తమైన సాంఘిక, ఆంతర్గత అస్తవ్యస్తతలన్నింటినీ మీరు అర్ధం చేసుకున్నప్పుడు ప్రతి ఒక్క మనిషి ఆకాంక్షల తోనూ, అత్యాశలతోనూ, యితరులలో ఆగ్రహద్వేషాలు రగిలిస్తూ, పోటీలు పడుతూ, హోదా కోసం తపిస్తూ, అధికారం కోసం, ఆధిపత్యం కోసం ఆరాటపడుతూ వున్నంత కాలం అతడు అస్తవ్యస్తతను తయారు చేస్తూనే వుంటాడు అనేది అర్థం చేసు కున్నప్పుడు; అస్తవ్యస్తత యొక్క నిర్మాణ స్వరూపాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు- ఆ అర్ధం చేసుకోవడం అన్నదానిలో నుండే క్రమ శిక్షణ వుద్భవిస్తుంది. అణచి వుంచడం ద్వారా కలిగే క్రమశిక్షణ కాదు, అనుకరణ ద్వారా కలిగేదీ కాదు, నిరాకరణ ద్వారానే అసలైన, క్రమశిక్షణ కలుగుతుంది, అదే క్రమశీలత.
కాబట్టి, తనని తాను అవగాహన చేసుకోవడమే వివేకానికి ఆరంభం. వివేకం పుస్తకాల్లో వుండదు, అనుభవంలో వుండదు, మరొకరిని అనుసరించడంలో వుండదు, బోలెడు ధర్మపన్నాలు వల్లించడంలో వుండదు. తనని తాను అవగాహన చేసుకున్న మనస్సులో, ఆలోచన ఎట్లా పుడుతున్నది అనేది అవగాహన చేసుకున్న మనస్సులో